నిజామాబాద్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని పలు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నిజామాబాద్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువుల్లో నీటిమట్టం పెరిగింది. కొన్ని చోట్ల అకాల వర్షాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లింది.
దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. భారీ వర్షాలతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పాడ్డాయి. ఆగ్నేయ, దక్షిణ ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు బలమైవ గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాయువ్య భారతదేశంలో గాలుల్లో అస్ధిరత ఏర్పడిందని అధికారులు తెలిపారు.