Karimnagar: హృదయ విదారక ఘటన.. తండ్రి చితికి నిప్పు పెట్టిన కూతురు..
- కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన
- కూతురు పెళ్లికి చేసిన అప్పు తీర్చలేక....
- మరో ఇద్దరు కుమార్తెల పెళ్లి చేయలేక
- పురుగుల మందు తాగి తండ్రి ఆత్మహత్య
- కొడుకులు లేకపోవడంతో చితికి నిప్పు పెట్టిన కుమార్తె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కూతురి పెళ్లి కోసం చేసిన అప్పు ఓ వైపు మరో ఇద్దరు కూతుళ్ల వివాహం చేయాలనే మనోవేదన మరో వైపు ఎం చేయాలో తెలియని పరిస్థితుల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసిన తీరు గ్రామంలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన పెద్ద సమ్మయ్య – సుగుణ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురు శృతి వివాహం గత ఐదు సంవత్సరాల క్రితం కాగా మిగతా ఇద్దరు కూతుళ్లు పల్లవి, అక్షయ చదువుకుంటున్నారు. పెద్ద కూతురు వివాహానికి దాదాపు ఆరు లక్షల అప్పు చేశాడు సమ్మయ్య. సమ్మయ్యకు మూడెకరాల బీడు భూమి ఉంది. ఇదే భూమి లో వ్యవసాయం చేస్తూ కూలి పనులకు వెళ్ళి వచ్చిన డబ్బులతో అప్పు తీరక మరో ఇద్దరు కూతుళ్ల వివాహం చేయాల్సి ఉందనే మనస్థాపంతో గత నెల 29 న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు తండ్రి చితికి నిప్పు పెట్టి అంతక్రియలు పూర్తి చేసింది. ముగ్గురు కూతుళ్లు తండ్రి కోసం ఏడుస్తున్న తీరు గ్రామస్థులను కంట తడి పెట్టించింది.
READ MORE: UP: పెళ్లి రోజు నైట్ బెడ్‌రూంలో భర్త లోపాన్ని గుర్తించిన భార్య.. అత్తామామలకు విషయం చెప్పడంతో..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!