Heart Break Incident : వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ మండలం పర్వత్పల్లి గ్రామంలో ఉన్న అంజనేయ స్వామి దేవాలయం వద్ద హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ కొండముచ్చు చింత చెట్టు మీద నుంచి కాలు జారి కిందపడి మృతి చెందింది. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. మృతి చెందిన కొండముచ్చుకు హిందూ సంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు ఈ ఘటనపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కొండముచ్చుకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు జరిపారు.
Mahavatar Narsimha: 150 కోట్లు కొల్లగొట్టిన యానిమేషన్ నరసింహుడు
అయితే.. అంతిమయాత్ర సందర్భంగా, మృతి చెందిన తల్లి కొండముచ్చును ఒడిలో హత్తుకుని ఓ పిల్ల కొండముచ్చు కూర్చుని ఉండటం అందరి హృదయాలను కదిలించింది. అంతిమయాత్ర ముగిసే వరకు ఆ పిల్ల కొండముచ్చు అలాగే తన తల్లి దగ్గర కూర్చుని ఉన్న దృశ్యం భావోద్వేగ తీవ్రతను మరింత పెంచింది. ఈ ఘటన తల్లి ప్రేమ మనుషులకైనా.. జంతువులకైనా ఓకే విధంగా ఉంటుందని మరోసారి రుజువు చేసింది.
Srinu Vaitla : మహేశ్ బాబు విషయంలో ఆ బాధ ఉంది.. శ్రీను వైట్ల కామెంట్స్