Vizag: విశాఖపట్నంలో మందుల కోసం వచ్చి మెడికల్ షాప్ దగ్గరే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు విజయనగరం జిల్లా బుదరాయవలసకు చెందిన రమణ (60)గా గుర్తింపు.
వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వారు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ తండాలో నివాసం ఉంటున్న బీమ్లా అనే వ్యక్తి ఆందోల్ మండలం అన్నాసాగర్ దగ్గర రోడ్ ప్రమాదం జరగడంతో అతడు అక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలిసిన బీమ్లా తండ్రి తట్టుకోలేక పోయారు, చేతికొచ్చిన కొడుకు తన కళ్ళముందే నిర్జీవంగా పడి ఉండటంతో చూసి జీర్ణించుకోలేని బీమ్లా తండ్రి ధర్మా నాయక్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి పోయారు.
హైదరాబాద్ లో ఓ గర్భిణి హాస్పటల్ లోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. నిన్న (గురువారం) ఉదయం స్నానం కోసం బాత్రూంలోకి వెళ్లిన కల్పన ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయింది. దీంతో తల్లిదండ్రులు ఆమెనే గాంధీ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు కల్పనకు చికిత్స అందిస్తుండగా ఒక్కసారిగా ఫిట్స్, గుండెపోటుకు గురయ్యింది.
Peanuts: ఇటీవల కాలంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బుల సమస్య ఎక్కువైపోతోంది. దీంతో గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా వేగంగా పెరిగింది.
Walking 6,000-9,000 steps a day lowers risk of heart disease: ప్రస్తుతం గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొన్నాళ్ల వరకు వయసు పైబడిన వారికి వచ్చే వ్యాధిగా గుండె జబ్బులు ఉండేవి. కానీ ఇప్పుడు 20 ఏళ్ల యువకులు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. జీవనతీరు మారడం, పని ఒత్తడి, ఆహారపు అలవాల్లు, వ్యాయామం లేకపోవడం ఇలా అన్ని కలిసి గుండె వ్యాధులకు కారణం అవుతున్నాయి. తాజాగా ఓ అధ్యయనం…
ఉప్పు లేని జీవితం పప్పుతో సమానం. అంటే పప్పు సప్పగా ఉంటుంది సప్పగా ఉండే తిండి తినడం దండగా అని నిర్ధాణకు వచ్చేశారన్నమాట మన భోజనప్రియులు. ఉప్పు లేని వంటకాన్ని మనం ఊహించలేము. మనం చేసే ప్రతి వంటలోనూ ఉప్పు తప్పనిసరిగా ఉంటుంది. లేదంటే ఆ వంటకు రుచి ఉండదు.
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్లకే అకాల మరణం చెందడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎప్పుడూ ఎంతో ఫిట్ గా ఉండే ఆయనకు గుండె పోటు రావడం ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే ఆయన చేసిన ఆ వ్యాయామమే గుండెపోటుకు కారణం అంటున్నారు. సాధారణంగా వైద్యులు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని చెబుతారు. అయితే అతి వ్యాయామం కూడా ప్రాణాలను తీస్తుందట. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు కండలను పెంచుకోవడానికి గంటలు…