Cricketer Died In Live Match: లైవ్ మ్యాచ్‌లో మరణించిన భారత క్రికెటర్
- మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో
- జరుగుతున్న మ్యాచ్‌లో
- ఇమ్రాన్ సికందర్ పటేల్ అనే ఆటగాడు మైదానంలోనే మరణించాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cricketer Died In Live Match: మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఇప్పుడు క్రికెట్ ప్రేమికులను విషాదంలో ముంచేసింది. ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో జరుగుతున్న మ్యాచ్‌లో ఇమ్రాన్ సికందర్ పటేల్ అనే స్థానిక ఆటగాడు మైదానంలోనే మరణించాడు. ఈ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం మేరకు 35 ఏళ్ల ఇమ్రాన్ స్థానిక టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాడు. గరవాడే క్రికెట్ స్టేడియంలో లక్కీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, యంగ్ ఎలెవన్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్కీ బిల్డర్స్‌కు ఇమ్రాన్ కెప్టెన్‌గా ఉన్నాడు. లక్కీ బిల్డర్స్ తరఫున ఆడుతున్న ఇమ్రాన్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను మ్యాచ్ ఆరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత అతను అకస్మాత్తుగా అస్వస్థకు లోనయ్యాడు. ఆ తర్వాత 7వ ఓవర్ ప్రారంభానికి ముందు మెడ, చేయిలో నొప్పి రావడంతో అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మైదానంలో ఉన్న అంపైర్లు వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.
Also Read: Almonds Soaked In Honey: రోజూ తేనెతో నానబెట్టిన బాదంపప్పును తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
Also Read
- UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
- Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
దాంతో, ఇమ్రాన్ మైదానం నుండి బయటకు వెళ్లడం ప్రారంభించాడు. అయితే అతను బౌండరీకి చేరుకున్న వెంటనే ఒక్కసారిగా పడిపోయాడు. ఇది చూసిన ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులంతా ఆందోళనకు గురయ్యారు. వీలైనంత త్వరగా ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినా అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఇమ్రాన్ ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దింతో ఆటగాళ్లందరూ విషాదంలో మునిగిపోయారు. 35 ఏళ్ల ఇమ్రాన్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనతో భార్య, తల్లితో సహా కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇమ్రాన్ మృతితో స్థానిక ఆటగాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనను వారు నమ్మలేకపోతున్నారు. ఇమ్రాన్ స్థానిక క్రికెట్‌లో బాగా ఫేమస్.
తాజావార్తలు
-
Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. ‘ది ప్యారడైజ్’ పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
-
Chiranjeevi : 60 ప్లస్ లోనూ ఆ ఎనర్జీ ఎలా? తన యవ్వన ‘సీక్రెట్’ బయటపెట్టిన చిరంజీవి!
-
UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
-
Chiranjeevi : అది నా గొప్పతనం కాదు, నేను చేసింది ఏమీ లేదు!
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!