Maharashtra: మహారాష్ట్రలో ఓ విచిత్ర పరిస్థితుల్లో చనిపోయాడని డిక్లేర్ చేయబడిన వ్యక్తి, సజీవంగా ఉన్నట్లు తెలిసింది. మహారాష్ట్ర కోల్హాపూర్ జిల్లాలోని కసాబా బవాడ నివాసి అయిన 65 ఏళ్ల పాండురంగ్ ఉల్పేకి గుండెపోటు వచ్చింది. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు మరణించినట్లు ప్రకటించారు. Read Also: Cafe Owner Suicide: ‘‘భార్య, అత్తమామలు తీవ్రంగా హింసించారు’’.. ఆత్మహత్యకు ముందు పునీత్ వీడియో.. ఇక చేసేందేం లేక ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ని మాట్లాడారు.…
మహారాష్ట్రలోని జల్నాలో క్రికెట్ ఆడుతూ ఓ క్రీడాకారుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్య పరిచింది. జల్నాలోని డాక్టర్ ఫ్రేజర్ బాయ్స్ మైదానంలో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన 'క్రిస్మస్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్'లో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. ఆట ఆడుతూడగా.. మైదానంలో గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు.
Abdul Rehman Makki: ముంబై ఉగ్రదాడి కుట్రదారు, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీ ఈరోజు పాకిస్థాన్‌లో గుండెపోటుతో మరణించారు. అయితే, గత కొద్ది రోజులుగా లాహోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మధుమేహ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతూ.. ఈ రోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారని జమాత్-ఉద్-దవా అధికారి ధృవీకరించారు.
Masood Azhar: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్(జేఈఎం) చీఫ్ మౌలానా మసూద్ అజార్ గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. భారతదేశంలో పుల్వామా వంటి ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా ఉన్న అజార్, మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టుల లిస్టులో ఉన్నాడు. అతడి ఆరోగ్యం క్షీణించిన సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాడని, చికిత్స కోసం పాకిస్తాన్ తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లిన విశాఖ యువకుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విశాఖలోని గాజువాకకు చెందిన పిల్లి నాగప్రసాద్, గీతాబాయి దంపతుల కుమారుడు అయిన ఫణికుమార్(33) ఇటీవల ఎంబీఏ పూర్తి చేసి.. ఎంఎస్ చదివేందుకు కెనడాకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 14న నాగప్రసాద్‌కు ఫణికుమార్ రూమ్‌మేట్ ఫోన్ చేసి అతడు నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడు.
Cinnamon Benefits: భారతీయ వంటకాలలో దాల్చినచెక్కను ఆహార రుచిని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. దాల్చినచెక్క అనేక సమస్యలను ఎదుర్కోవటానికి మీకు సహాయపడుతుంది. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దాల్చినచెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని నివేదికలు తెలుపుతున్నాయి. కాబట్టి, శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడాన్ని సులభతరం చేస్తుంది. దాల్చిన చెక్క మీ మెదడుకు కూడా చాలా మేలు చేస్తుంది. అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్…
భారతదేశంలో అనేక రకాల నూనెలను వంటలకు ఉపయోగిస్తారు. వేరుశెనగ నూనె, పొద్దుతిరుగుడు నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనె, ఆలివ్ నూనె, ఆవాల నూనె మొదలైన అనేక రకాల నూనెలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారంగా ఆహారంలో నూనెను వాడతారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని రకాల నూనెలను వంటలో ఉపయోగించకూడదని అంటున్నారు. ఇందులో పామాయిల్ కూడా ఉంది. దీనిని ఉపయోగిస్తే గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాలో 14 ఏళ్ల బాలుడు నడుస్తున్న సమయంలో గుండె పోటుతో మణించాడు. మోహిత్ చౌదరి అనే బాలుడు తన పాఠశాలలో క్రీడా పోటీల కోసం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సిరౌలి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
Cricketer Died In Live Match: మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఇప్పుడు క్రికెట్ ప్రేమికులను విషాదంలో ముంచేసింది. ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో జరుగుతున్న మ్యాచ్లో ఇమ్రాన్ సికందర్ పటేల్ అనే స్థానిక ఆటగాడు మైదానంలోనే మరణించాడు. ఈ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం మేరకు 35 ఏళ్ల ఇమ్రాన్ స్థానిక టోర్నమెంట్లో పాల్గొంటున్నాడు. గరవాడే క్రికెట్ స్టేడియంలో లక్కీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, యంగ్ ఎలెవన్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది.…
Papaya Leaves and Seeds: బొప్పాయి పండు తినడానికి రుచికరంగా ఉన్నప్పటికీ, వీటిని తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు విన్నప్పటికీ.. దాని ఆకులు, విత్తనాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? లేదు కదా.. అయితే, బొప్పాయి ఆకులు ఇంకా పండులోని విత్తనాలలో అనేక ఖనిజాలతో పాటు అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.…