చలికాలంలో ఇవి తింటే ఆరోగ్యం సేఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలంలో శరీరంతోపాటు చర్మం కూడా వివిధ ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే చలికాలంలో చర్మానికి కాంతిని, ఆరోగ్యాన్ని అందించే విటమన్ ‘సి’ ఉన్న పళ్లను ఇతర పదార్థాలను తీసుకుంటే మంచిది. ఈ కాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను నివారించగల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని వినియోగించుకుని చలి కాలంలో వచ్చే రుగ్మతలను దూరం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చలికాలంలో చాలామంది నీటిని అంతగా తాగరు. కానీ వేసవిలో ఎంత నీరు తాగుతామో చలికాలంలో కూడా నీటిని ఎక్కువగా తాగే అలవాటు చేసుకోవాలి. వేసవికాలంలో ఎంత నీరు తాగుతామో చలికాలంలో అందులో 20 శాతం నీటిని కూడా తాగం. ఈ కాలంలో వాతావరణంలో తేమ కూడా ఉండదు. దీని దుష్ప్రభావం శరీర ఆరోగ్యంపై చూపుతుంది. అంతే కాకుండా చర్మం మీద కూడా దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. చలికాలంలో ఎక్కువగా అల్లం టీని తాగాలి. గొంతుకు ఉపశమనం కలిగించే అద్భుతమైన మందు అల్లం. పిల్లలు దగ్గు, శ్లేషంతో బాధపడుతుంటే వాళ్లకు అల్లం టీ తాగించడం మంచిది. అల్లం రసం ఉదయాన్ని తాగిస్తే మంచిది. దీని ప్రభావంతో రక్త ప్రసరణ కాస్త మెరుగుపడుతుంది. చలి కారణంగా జీవ క్రియ మందగించకుండా అల్లం కాపాడుతుంది.
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
చలికాలంలో బెల్లం తినడం ఎంతోమంచిది. బెల్లం తింటే శరీరంలో వేడి పుట్టి అవసరమైన ఉష్ణం నిలిచి ఉంటుంది. బెల్లంలో ప్రొటీన్, మెగ్నీషియం, మినరల్స్, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్ మొదలైనవి తగినంత మోతాదులో ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. బెల్లం తినడం వల్ల జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది. శరీరానికి సాధారణంగా పిల్లలు బెల్లం తినడానికి ఇష్ట పడరు. కాబట్టి వారికి బెల్లం హల్వా ఇతర వంటకాలను చేసి తినిపించాలి.
బెల్లంలోని ఐరన్ శరీరానికి శక్తిని ఇస్తుంది. చలికాలంలో దొరికే బత్తాయి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉంటుంది. వీటిని చలికాలంలో వాడితే చర్మం, జలుబు లాంటి సమస్యలు దరి చేరకుండా వుంటాయి. ఈపండుకు చలువ చేసే స్వభావం ఉంది. రాత్రి పూట కాకుండా ఉదయం ఈ పండు రసం తాగితే మంచిది. కమల పండు కూడా మంచిదే. చలి కాలంలో చిన్న పిల్లల ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్‌ను ఎక్కువగా తినేలా చూడాలి. యాపిల్స్, కివీస్, బొప్పాయి తినిపించాలి. చలి కాలంలో గోరు వెచ్చని నీరు తాగడం, చలిగాలులు చెవులకు తగలకుండా స్వెట్టర్లు, మఫ్లర్‌లు, మాస్క్‌లు ధరించడం వల్ల రక్షణ పొందవచ్చు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!