దేశంలోనే వైద్యరంగంలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రమని మరోసారి రుజువైంది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా రెండు కేటగిరీల్లో తెలంగాణ చాంపియన్ గా నిలిచింది. తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ వైద్య రంగం పటిష్టమైందని మరోసారి చాటి చెప్పింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం “హెల్దీ అండ్ ఫిట్ నేషన్” క్యాంపెయిన్ ను ప్రారంభించింది. నవంబర్ 16 తేదీ నుండి డిసెంబర్ 13 వరకు జరిగిన ఈ క్యాంపెయిన్ లో సబ్…
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులలో తయారు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి హారీష్ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రుల్లో రూ.12 కోట్ల విలువైన ఆధునిక పరికరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ పరికరాలు సామాన్యుల వైద్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జన్యు లోపాలపై ఆధునిక వైద్యం, బోన్ లోపాలు ముందే తెలుసుకునే ఆధునిక పరికరాలను ప్రభుత్వ ఆస్పత్రిలో తొలిసారి ఏర్పాటు చేశామని తెలిపారు. నిమ్స్‌లో 155 ICU బెడ్స్ అందుబాటులో…
కరీంనగర్‌లో కరోనా కలకలం కొనసాగుతుంది. బొమ్మకల్‌లోని చల్మెడ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు, స్టాఫ్‌కు మొత్తం 49 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాలేజీలో మొత్తం 1000 మంది ఉండగా, మరో 100 మంది విద్యార్థుల శాంపిల్స్‌ను టెస్టులకు వైద్య సిబ్బంది పంపించారు. 49 మందికి పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కళాశాల యాజమాన్యం ఆందోళనలో ఉంది. దీంతో కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. కరోనా కేసులు పెరగడంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వెంటనే వైద్య ఆరోగ్య శాఖను…
దేశ ఆరోగ్య సూచిల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచాలంటూ కీలక సూచనలు చేశారు మంత్రి హరీష్‌రావు.. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లడుతూ.. వైద్య రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో ఉంచాలని, ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య సూచిల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉన్న జిల్లాలు పురోగతి సాధించాలన్నారు. ఆ దిశగా అధికారులు సత్వర చర్యలకు పూనుకోవాలని ఆదేశించారు హరీష్‌రావు.. ఇక, విభాగాల వారీగా అధికారులు వారి…
కరోనా అంతం కాలేదని ఈ మహమ్మారి పోరాటంలో అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి మెలిసి పని చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. దేశంలోని చివ రి పౌరుడి వరకు టీకా అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇంటింటింకి కరోనా వ్యాక్సిన్ అందజేసేందుకు చేపడుతున్న హర్ ఘర్ దస్తక్ కార్యక్రమం పై కేంద్ర మంత్రి అన్ని రాష్ర్టాలు, కేంద్ర పా లిత మంత్రులతో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సం…
వైద్య ఆరోగ్య శాఖ, నాడు–నేడు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, కంటి వెలుగుతో పాటు ప్రాధాన్య కార్యక్రమాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా అధికారులను వివరాలు అడిగి తెలసుకోవడంతో పాటు పలు ఆదేశాలు ఇచ్చారు.వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,011 వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం, ఇప్పటికే 8,585 చోట్ల పనులు మొదలయినట్టు అధికారులు తెలిపారు. పీహెచ్‌సీల్లో నాడు – నేడు కార్యక్రమాలు వేగంగా…
వైద్యశాఖలో అంతా గందరగోళమే. ఎన్నో సమస్యలు, మరెన్నో ఇబ్బందులు. దీనికితోడు ఇంఛార్జుల పాలన. ఏళ్లు గడుస్తున్నా.. పూర్తిస్థాయి అధికారులు రారు. వ్యవస్థ మొత్తం డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి. కీలకమైన వైద్య విభాగంలో ఎందుకిలా జరుగుతోంది? వైద్యశాఖలో ఇంఛార్జుల పాలన..! విభజన చట్టం ప్రకారం తెలంగాణ వైద్యశాఖలో చర్యలు తీసుకోలేదు. దీంతో పరిపాలనా విభాగాలలో ఇంఛార్జుల కాలం నడుస్తోంది. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, హెల్త్ యూనివర్సిటీ వీసీ, నర్సింగ్ రిజిస్ట్రార్, నిమ్స్ డైరెక్టర్‌లు అనేక సంవత్సరాలుగా కుర్చీలను వదలటం…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి.. కరోనా థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి… ఇక, కేరళలో సెకండ్ వేవ్‌లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఈ మధ్య కాస్త తగ్గుముఖం పట్టినా.. మరోసారి భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.. దీంతో.. అప్రమత్తమైన ప్రభుత్వం.. వీకెండ్‌లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయానికి వచ్చింది.. ఈ నెల 24, 25 తేదీల్లో (శనివారం,…
కరోనా సెకండ్ వేవ్‌లో కేసులు తక్కువగా నమోదవుతున్నా, ఇంకా పూర్తిగా నియంత్రలోకి రాలేదు. మొదటి వేవ్‌లో ఆల్ఫారకం వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందితే, రెండో దశలో డెల్టావేరియంట్ వ్యాప్తి అధికంగా ఉందని, సెకండ్ వేవ్ లో వ్యాప్తి చెందుతున్న ఈ డెల్టా వేరియంట్ కు వ్యాప్తిచెందే గుణం అధికంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇలాంటి సమయంలో సెకండ్ వేవ్ తొలగిపోయిందని అనుకోవడం పోరపాటే అని, తప్పని సరిగా మాస్కులు ధరించాలని తెలియజేసింది. నిబంధనలు ఉల్లంఘించి…
తెలంగాణ హైకోర్టులో కరోనా స్థతి గతులపై విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కరోనా పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 29న లక్ష పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన 10 ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా చికిత్స లైసెస్సులు రద్దు చేసినట్టుకు ప్రభుత్వం తెలిపింది. 79 ఆసుపత్రులకు 115 షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వం…