Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Review Of Cm Jagan On Medical Health

వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

Published Date :November 10, 2021 , 4:16 pm
By NTV WebDesk
వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష
  • Follow Us :
  • google news
  • dailyhunt

వైద్య ఆరోగ్య శాఖ, నాడు–నేడు, వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్, కంటి వెలుగుతో పాటు ప్రాధాన్య కార్యక్రమాలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా అధికారులను వివరాలు అడిగి తెలసుకోవడంతో పాటు పలు ఆదేశాలు ఇచ్చారు.వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ పనులు వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,011 వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణం, ఇప్పటికే 8,585 చోట్ల పనులు మొదలయినట్టు అధికారులు తెలిపారు.

పీహెచ్‌సీల్లో నాడు – నేడు కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయన్న అధికారులు సీఎంకు వివరించారు. డిసెంబర్‌ నాటికి మరమ్మతు పనులు పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు. అవసరమైన చోట 146 కొత్త భవనాల నిర్మాణం మార్చి 2022 నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.వీటి నిర్మాణా లు కూడా మరింత వేగంగా పూర్తి చేయాలన్న సీఎం అధికారులను ఆదేశించారు. సీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో నాడు – నేడు పను లు చురుగ్గా సాగుతున్నాయని, అత్యవసర పనులను ఇప్పటికే పూర్తి చేశామన్న అధికారులు సీఎంకు వివరించారు. మిగిలిన పనులుకూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం అధికారులను ఆదేశించారు.

Also Read

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
  • AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
  • Off The Record : టీడీపీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారా?

16 కొత్త మెడికల్‌కాలేజీల్లో పనుల ప్రగతిపై సీఎం సమీక్ష
ఇప్పటికే నాలుగు చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల నిర్మాణాలకు సన్నాహలను పూర్తిచేస్తున్నామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖజిల్లా అనకాపల్లి మెడికల్‌ కాలేజీ స్థలాలపై కోర్టులో పిటిషన్లు దాఖలై ఉన్నాయని వీటిని త్వరగా పరిష్కరించే విధంగా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇవికాకుండా 9 చోట్ల జరుగుతున్న సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణ పనుల ప్రగతిపైనా సీఎం సమీక్షించారు.

గణనీయంగా పెరిగిన వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ సేవలు
2019 జూన్‌కు ముందు ఆరోగ్య శ్రీ కింద ఉన్న వైద్య ప్రక్రియలు 1059, 2019 జూన్‌ తర్వాత 2446 వైద్య ప్రక్రియలకు పెరిగాయని అధికారులు తెలిపారు. 2019 జూన్‌కు ముందు ఆరోగ్యశ్రీ కింద ఉన్న కవరేజీ ఆస్పత్రులు 919, తర్వాత 1,717 ఆస్పత్రులకు పెంపు తోపాటు కొత్తగా 3,18,746 మందికి ఆరోగ్య శ్రీ ద్వారా లబ్ది చేకూరిం దన్నారు. 2019 జూన్‌కు ముందు ఆరోగ్య శ్రీద్వారా సగటున రోజుకు లబ్ధి 1570 మందికి జరిగితే.. ప్రస్తుతం 3,300 మందికి లబ్ది చేకూరు తుందన్నారు. బధిర, మూగ వారికి పూర్తి ఖర్చులతో శస్త్రచికిత్సలు చేస్తున్నామన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజునే ఆరోగ్య ఆసరా కింద డబ్బు చెల్లింపులు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకూ 7,82,652 మందికి ఆరోగ్య ఆసరా కింద రూ. 439.4 కోట్లు చెల్లించి నట్టు అధికారులు తెలిపారు.క్యాన్సర్‌ రోగులకూ పూర్తిస్థాయిలో ఉచి తంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలన్న నిర్ణయం అమల్లోకి తెచ్చామని, దీన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సీఎం అధి కారులను ఆదేశించారు.

వైయస్సార్‌ కంటి వెలుగుపైనా సీఎం సమీక్ష
ఇంతకుముందు ఎవరైనా పరీక్షలు చేయించుకోనివారికి పరీక్షలు చేయించాలన్న సీఎం.కంటి సమస్యలు గుర్తించిన వారికి కళ్లజోడు ఇవ్వాలని, అవసరమైనవారికి శస్త్రచికిత్సలు చేయించాలన్న సీఎం. దీనికోసం ఒక వారంరోజులపాటు డ్రైవ్‌ నిర్వహించాలన్న సీఎం అధికారులను కోరారు. ఇప్పటికే 66,17,613 మంది పిల్లలకు పరీక్షలు చేశామని, వారిలో 1,58,227 మంది కంటి అద్దాలు ఇచ్చామని తెలిపిన అధికారులు.60 ఏళ్ల పైబడ్డ వారికి 13,58,173 మందికి పరీక్షలు చేశామన్న అధికారులు, ఇందులో 7,60,041 మందికి కంటి అద్దాలు ఇవ్వాల్సి ఉండగా 4,69,481 మందికి కంటి అద్దాలు ఇచ్చామన్న అధికారులు, మరో 1,00,223 మందికి శస్త్రచికిత్సలు చేయించామన్న అధికారులు తెలిపారు.

మరో 26,437 మందికి కాటరాక్ట్‌ సర్జరీలు చేయించాలన్న అధికారులు సీఎంకు వివరించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విలేజ్‌ హెల్త్‌ క్లిని క్స్‌కు, 104కు అనుసంధానంచేసి.. నిరంతర ప్రక్రియగా కొనసాగిం చాలన్న సీఎం అధికారులను ఆదేశించారు. దీంతో పాటు హెల్త్ హ బ్స్ పై సీఎం మాట్లాడారు. జిల్లాకేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు కానున్న హెల్త్‌ హబ్స్‌. మొత్తం 16 చోట్ల ఏర్పాటు కానున్న హెల్త్‌ హబ్స్‌, ఇప్పటికే 13 చోట్ల స్థలాలు గుర్తించారు.

కోవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలందించిన అధికారులు
మొత్తం పాజిటివ్‌ కేసులు 3,366 పాజిటివిటీ రేటు 0.7 శాతంగా ఉందన్నారు. పాజిటివిటీ రేటు 0 నుంచి 2 లోపు ఉన్న జిల్లాలు 12, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందన్న వైద్య ఆరోగ్యశాఖ అధి కారులు తెలిపారు. 2 కంటే పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లా 1 గా ఉందన్నారు.అందుబాటులో ఉన్న మొత్తం ఆక్సిజన్‌ కాన్సం ట్రేట ర్స్‌ 23,457 అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ డీ–టైప్‌ సిలిండర్లు 27,311 ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు మొత్తం 140 ఉన్నా యని తెలిపారు.15 డిసెంబరు నాటికి పీఏస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు పూర్తిచేస్తామన్న అధికారులు
వ్యాక్సినేషన్‌
సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు 1,17,71,458
రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు 2,17,88,482
మొత్తం వ్యాక్సినేషన్‌ చేయించుకున్నవారు 3,35,59,940
మొత్తం వ్యాక్సినేషన్‌ కోసం ఉపయోగించిన డోసులు 5,53,48,422 గా ఉందని అధికారులు పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP CM YS Jagan
  • Health Department
  • jagan

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions