పుట్టిన ప్రతి బిడ్డకు, పిల్లలకు తల్లిపాలు ఒక వరం.. వాటిని మించిన పౌష్టికాహారం బిడ్డకు ఈ ప్రపంచంలో ఎక్కడా దొరుకదు. అలాపాలు ఇవ్వడం ద్వారా అటు తల్లికి, వాటిని తాగడం ద్వారా బిడ్డకు ఆరోగ్యకరమని అనేక అధ్యయనాలు రుజువు చేశాయి కూడా. అయితే.. ఆరు నెలల వయసు వచ్చేవరకు బిడ్డకు కచ్చితంగా తల్లిపాలే తాగించాలని శాస్త్రవేత్తలు.. డాక్టర్లు చెప్తున్నారు. ఈనేపథ్యంలో.. కొందరు తల్లిదండ్రులు ప్రకటనలు చూసి మోసపోతూ రసాయన మిశ్రమాలతో తయారైన కృత్రిమ పాలు తాగిస్తూ చేజేతులా…
మందు తాగటం మంచి అలవాటు కాదంటారు. కానీ 40 ఏళ్ల వయసు దాటినవారు స్వల్పంగా ఆల్కహాల్ తీసుకోవటం ఆరోగ్యానికి లాభిస్తుందని లాన్సెట్ స్టడీ తెలిపింది. రెడ్ వైన్‌ని రెండు, మూడు పెగ్గులేస్తే గుండె జబ్బులు, గుండెపోటు, షుగర్ లెవల్స్ వంటి హెల్త్ రిస్కులు తగ్గుతాయని పేర్కొంది. 39 ఏళ్ల లోపువారు మందుకొడితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనమూ ఉండదని, పైగా అనారోగ్యానికి గురవుతారని హెచ్చరించింది. మన దేశంలో గత 30 ఏళ్లలో ఆల్కహాల్ వినియోగం కొంచెం పెరిగినట్లు వెల్లడించింది.…
మనిషి శరీరం చేయగలిగే అత్యుత్తమ వ్యాయామాల్లో యోగా ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణకు నోచుకుంటుంది. ఏ వ్యాయామంతో కూడా పోల్చి చూసినప్పటికీ కూడా యోగాలో ఉన్న చాలా విశిష్టతలు యోగాని చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి. యోగకు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది కేవలం శరీరం పై మాత్రమే ప్రభావం చూపించదు. శరీరంతో పాటు మెదడు మరియు ఆత్మ ఇలా అన్నింటిని వృద్ధి చేయడంలో యోగ కీలక పాత్ర…
ఆహార అలవాట్లపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. చాలామంది రకరకాల డైట్లు ఫాలో అవుతుంటారు. ఇందుకోసం డబ్బులు ఖర్చు పెట్టడమేకాకుండా.. ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రతి రోజూ మనం తినే ఆహారంలో ఈ ఐదింటిని చేర్చుకోవడంతో రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలేంటో చూద్దామా.. పెరుగు పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును…
ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగిపోవడంతో అందరూ సైకిళ్లను పక్కనపెట్టేసి బైకులు, కార్లనే వాడుతున్నారు. దీంతో సైకిల్ వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతున్నారు. అందుకే 2016లో ప్రపంచ సైక్లింగ్ అలయెన్స్ (డబ్ల్యూసీఏ), ఐరోపా సైక్లిస్ట్స్ సమాఖ్య (ఈసీఎఫ్) కలిసి ప్రతి ఏడాది ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితిని కోరాయి.…
ఏ సీజన్లో అయినా అందుబాటులో ఉండే పండు ఏదైనా ఉందా అని అంటే అది కేవలం బొప్పాయి పండే. చౌకైన పండ్లలో ఇది కూడా ఒకటి. తక్కువ ధరకు లభిస్తుండటంతో చాలా మంది దీన్ని ఇష్టపడరు. కానీ ఈ పండులో అన్ని పండ్ల కంటే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, కెరోటిన్, విటమిన్ C వంటి ఖనిజాలు, అర్జినైన్, కార్బైన్ వంటి ముఖ్యమైన ఎంజైమ్‌లు ఉంటాయి. వేసవిలో కూడా ఎక్కువగా లభించే ఈ బొప్పాయి తింటే…
మండే వేసవి ఎన్నో ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఏదో ఒకటి తాగాలని అనిపిస్తుంది. వేసవిలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. కానీ అది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిదికాదు. ఏం తాగినా నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. శరీరంలోని నీరు మొత్తం చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. డీ హైడ్రేషన్ సమస్య వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతాం. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. అదే విధంగా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. వేసవిలో బార్లీ…
పుచ్చకాయ పేరుచెబితే వేసవిలో నోరూరుతుంది. ఎండాకాలంలో డీ హైడ్రేషన్ ప్రాబ్లం రాకుండా పుచ్చకాయలు తినాలని డాక్టర్లు చెబుతుంటారు. రోడ్లమీద వెళుతున్నప్పుడు నలుపు రంగు గింజలతో చూడగానే నోరూరించేలా ఎరుపురంగు పుచ్చపండు కనిపిస్తుంది. సామాన్యులు సైతం కొనుక్కోగలిగే ధరల్లో ఇవి లభ్యమవడం వల్ల వీటికి ప్రాధాన్యత బాగా పెరిగింది. ఏ సీజన్లో అయినా, కేజీ 50 నుంచి 100కి మించకుండా వుంటుంది. ఒక్కోసారి అయితే కిలో 14 నుంచి 20 రూపాయల ధర పలుకుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన…