India Head Coach: గంభీర్ స్థానంలో టీమిండియాకు కొత్త కోచ్!
- దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు
- నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
- టీమిండియాకు కొత్త కోచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య నవంబర్ 8 నుంచి 15 వరకు 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ టీ20 సిరీస్ కోసం ఇటీవలే బీసీసీఐ జట్టును ప్రకటించింది. భారత జట్టు కోచింగ్ బాధ్యతలను భారత మాజీ క్రికెటర్, ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ అందుకోనున్నాడని తెలిసింది. లక్ష్మణ్ గతంలో కూడా తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నవంబర్ మూడో వారం (నవంబర్ 22) నుంచి మొదలుకానుంది. రోహిత్ సేన నవంబర్ 10న ఆసీస్ బయలుదేరే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా పర్యటనతో రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బిజీగా అవ్వనున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికాతో సిరీస్ నవంబర్ 8 నుంచి ఆరంభం అవుతుంది. రెండు సిరీస్‌లు క్లాష్ అవ్వడంతో.. దక్షిణాప్రికా సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించడం గంభీర్‌కు సాధ్యపడదు. అందుకే వీవీఎస్ లక్ష్మణ్‌కు తాత్కాలిక కోచ్‌గా బీసీసీఐ బాధ్యతలు అప్పగించనుంది.
Also Read
వీవీఎస్ లక్ష్మణ్‌కు సహాయక కోచింగ్ సిబ్బందిగా ఎన్సీఏలో ఇతర కోచ్‌లు సాయిరాజ్ బహుతులే, హృషికేష్ కంటికర్, శుభదీప్ ఘోష్ ఉండనున్నారు. ఎమర్జింగ్ ఆసియా టీ20 కప్ కోసం భారత-ఏ జట్టుకు సాయిరాజ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపించనున్నాడు.
భారత్ టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్‌కుమార్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!