World Cup 2023: ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్‌పై వేటు.. టీమిండియా కొత్త కోచ్ ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashish Nehra To Become India Head Coach After Rahul Dravid: బీసీసీఐతో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల ఒప్పందం ప్రపంచకప్ 2023 అనంతరం ముగియనుంది. ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధిస్తే.. మరోసారి ద్రవిడ్‌ని హెడ్ కోచ్ పదవిలో కొనసాగిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవేళ భారత్ టైటిల్ గెలువకుంటే.. ద్రవిడ్‌పై ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది. ఎందుకంటే అండర్-19లో మాదిరి అంతర్జాతీయ క్రికెట్‌లో ‘ది వాల్’ ఇప్పటివరకు తనదైన ముద్ర వేయలేదు. ఒక్క మేజర్ టోర్నీలో కూడా భారత్ విజేతగా నిలవలేదు.
ప్రపంచకప్ 2023లో భారత్ సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇది హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ విజయంగా పరిగణించబడదు. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ కొత్త కోచ్ కోసం వెతకవచ్చు. ఐపీఎల్‌లో విజయవంతమైనందున భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా టీమిండియా కోచ్‌గా మారడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే గుజరాత్ టైటాన్స్‌తో ఒప్పందం ఉన్న కారణంగా జాతీయ జట్టుకు కోచ్‌గా మారడానికి నెహ్రా ఆసక్తి చూపుతాడో లేదో. ఇక టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కోచ్‌గా రావాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అతడికి ఆసక్తి ఉంటే మహీ రంగంలోకి దిగినా ఆశ్చర్యం లేదు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Also Read: IND vs PAK: భారీ స్కోర్ సాధిస్తాం.. పాకిస్థాన్ పేసర్లను హెచ్చరించిన భారత్!
ప్రపంచకప్ 2023 తర్వాత ఇంగ్లండ్ మాదిరి టెస్ట్, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లకు వేర్వేరు కోచ్‌లను బీసీసీఐ నియమించినా ఆశ్చర్యం లేదు. అన్ని ఫార్మాట్‌లకు ప్రత్యేక కోచ్‌లను కలిగి ఉండాలని ఇప్పటికే అంతా భావిస్తున్నారు. అదే జరిగితే టెస్టు జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను కొనసాగించి.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లకు మరొకరు ఉండనున్నారు. మరి ప్రపంచకప్ తర్వాత బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నాలుగేళ్ల పాటు హెడ్ కోచ్‌గా కొనసాగిన రవిశాస్త్రి స్థానంలో ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ వచ్చిన విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచకప్ 2021లో భారత జట్టు నిరాశజనక ప్రదర్శన అనంతరం రవిశాస్త్రి హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అనేక చర్చల అనంతరం రాహుల్ ద్రవిడ్‌ను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఒప్పించి హెడ్ కోచ్‌గా నియమించాడు. 2021 నవంబరులో బాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్.. రోహిత్ శర్మతో కలిసి పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలు అందించాడు. అయితే ఆసియా కప్ 2022, టీ20 ప్రపంచకప్ 2022 సహా టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లోనూ భారత్ ఓడిపోవడం ద్రవిడ్‌కు మచ్చగా మారింది. ద్రవిడ్‌ను తొలగించాలనే డిమాండ్లు చాలాసార్లు తెరపైకి వచ్చాయి.
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!