Sanath Jayasuriya: శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) తన జట్టుకు మార్చి 31, 2026 వరకు మాజీ వెటరన్ ఆటగాడు సనత్ జయసూర్యను కోచ్‌గా నియమించింది. ప్రస్తుతం జయసూర్య జట్టుకు తాత్కాలిక కోచ్‌గా ఉన్నారు. భారత్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌కు, ఆ తర్వాత జరిగిన ఇంగ్లండ్, న్యూజిలాండ్ లతో జరిగిన టెస్టు సిరీస్‌కు కోచ్‌గా నియమించబడ్డాడు. ఇకపోతే జయసూర్య కోచ్‌గా వచ్చిన తర్వాత శ్రీలంక ఆటతీరు అద్భుతంగా కొనసాగింది. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత క్రిస్ సిల్వర్ వుడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు.
Also Read: President Muizzu: భారత టూరిస్టులకు మాల్దీవుల అధ్యక్షుడు ప్రత్యేక విజ్ఞప్తి..
ఆ తర్వాత జయసూర్య కోచ్‌గా మారిన తర్వాత భారత క్రికెట్ జట్టు 27 ఏళ్ల తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టుతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. దీంతో పాటు ఇంగ్లండ్ గడ్డపై జరిగిన టెస్టు మ్యాచ్‌లోనూ శ్రీలంక విజయం సాధించింది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు 2-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు శ్రీలంక వచ్చినప్పుడు కూడా 2-0 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా 2026 వరకు జయసూర్యకు ఈ పదవి లభించింది. ప్రస్తుతం శ్రీలంక ఫామ్ కు ఇంకెన్ని సంచనాలను సృష్టిస్తారో చూడాలి మరి.
Also Read: Shraddha Arya : బేబీ బంప్ తో జనాలకు సడన్ షాక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్