రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆరమైసమ్మ దేవాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దర్గాఖలీజ్ ఖాన్ గ్రామానికి చెందిన అంజి ఆదివారం కావడంతో చికెన్ తీసుకొని వస్తానని మోటర్ సైకిల్ పై బయలుదేరాడు. అటుగా వస్తున్న ఆటో అంజి బైక్ ను బలంగా ఢీకొట్టిది. కింద పడ్డ అంజి అక్కడికక్కడే మృతి చెందాడు.