HCA Corruption: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజుపై సీఐడీకి ఫిర్యాదు అందింది. మల్టిపుల్ క్లబ్ ఓనర్‌షిప్ ప్రయోజనాలతో హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలిచారని అంబుడ్స్‌మన్, సీఐడీకి హెచ్‌సీఏ మాజీ కోశాధికారి చిట్టి శ్రీధర్ ఫిర్యాదు చేశారు.
ప్రెసిడెంట్ తో సహా మరో నలుగురు జైలుపాలయ్యారు…!! తీగ లాగితే డొంక కదిలి… అందరి బాగోతం బయటపడుతోంది..!! వందల కోట్ల అవినీతి చూసి జనాలు ఛీ కొడుతున్నారు..!! అయినా HCA తీరు మారడం లేదు. నెక్ట్స్ నేనే ప్రెసిడెంట్… నువ్వు సెక్రెటరీ… అని కొందరంటే… నీ బాగోతం కూడా బయటపెడతా… నేనే ప్రెసిడెంట్ అంటున్నాడట మరో పెద్దాయన !! అవినీతి మరకను కడిగిపారేసి.. ఇప్పటికైనా హెచ్‌సీఏలో ప్రక్షాళన చేపట్టాల్సిందిపోయి.. అవినీతి తిమింగలాల వారసులు పుట్టుకొస్తున్నారట !! హైదరాబాద్…
HCA Elections 2023 Results Out Today: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలు మొదలయ్యాయి. ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో హెచ్‌సీఏ ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు పోలింగ్ జరగనుంది. ఇక సాయంత్రం 6 గంటలలోపు ఫలితాలు వెలువడే అవకాశముంది. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ పర్యవేక్షణలో జరుగుతున్న హెచ్‌సీఏ ఎన్నికలకు అధికారులు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కి చుక్కెదురు అయింది. హెచ్‌సీఏ ఓటరు జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగించింది. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేశారు.