HCA Elections : హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ ఎన్నికల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏ జగన్‌మోహన్‌రావు ఎన్నికయ్యారు. జగన్ మోహన్‌కు 63 ఓట్లు రాగా, అమర్‌నాథ్‌కు 62 ఓట్లు వచ్చాయి. అధ్యక్ష పదవికి బరిలో ఉన్న ఇతర అభ్యర్థులు అనిల్ కుమార్ 34, పిఎల్ శ్రీనివాస్ 10 ఓట్లు వచ్చాయి. గుడ్ గవర్నెన్స్ ప్యానెల్‌కు చెందిన దల్జీత్ సింగ్ 63 ఓట్లతో 17 ఓట్ల మెజారిటీతో ఉపాధ్యక్ష పదవికి పోటీలో గెలుపొందారు. అతని సమీప ప్రత్యర్థులు టి శ్రీనివాస్ (46), శ్రీధర్ (41) ఓట్లు వచ్చాయి.
అయితే.. 173 ఓట్లకు గాను 169 ఓట్లు పోలైనట్లు రిటర్నింగ్ అధికారి సంపత్ తెలిపారు. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానల్‌కు చెందిన ఏ. జగన్‌మోహన్‌రావు విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థిపై ఒక ఓటు తేడాతో గెలిచినట్లు ప్రకటించారు. అయితే ఇతర ప్యానల్ సభ్యులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. రీకౌంటింగ్‌లోనూ జగన్‌మోహన్‌రావు ఒక ఓటు తేడాతో విజయం సాధించినట్లు పోలింగ్ అధికారులు స్పష్టం చేశారు. కాగా, యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏకు అధికార బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఆ ప్యానల్‌కు చెందిన అభ్యర్థే ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హెచ్‌సీఏ గుడ్ గవర్నెన్స్ ప్యానల్‌కు చెందిన దల్జీత్ సింగ్ ఉపాధ్యక్షుడిగా, బసవరాజు జాయింట్ సెక్రటరీగా విజయం సాధించారు. క్రికెట్ ఫస్ట్ ప్యానల్‌కు చెందిన ఆర్.దేవరాజ్ సెక్రటరీగా గెలుపొందారు. ఇదే ప్యానల్‌కు చెందిన సునీల్ కుమార్ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానల్‌కు చెందిన సీజే.శ్రీనివాసరావు ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు. మొత్తంగా క్రికెట్ ఫస్ట్, యునైటెడ్ మెంబర్స్ ఫర్ హెచ్‌సీఏ ప్యానల్స్ నుంచే ఇద్దరు చొప్పున కీలక పదవులకు ఎన్నిక కావడం గమనార్హం. గుడ్ గవర్నెన్స్ ప్యానల్ నుంచి ఒక్క ఉపాధ్యక్షుడు మాత్రమే గెలుపొందారు.
Also Read
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!