ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, టీడీపీ పార్టీ కార్యకర్తల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ పిక్ ను షేర్ చేశారు. గతంలో చంద్రబాబును కలిసినప్పుడు చిరు ఫ్లవర్స్ బొకే అందిస్తున్న పిక్ అది. “శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మ దిన శుభాకాంక్షలు… వారు కలకాలం సంపూర్ణ…