హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన చేసింది. 43 బంతుల్లో 68 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.…
Harmanpreet Kaur Record in T20 World Cup: అక్టోబర్ 3 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. మెగా టోర్నీలో ఒక్కసారి కూడా విజేతగా నిలవని భారత్.. ఈసారి ట్రోఫీనే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా కప్ సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పేరిట టీ20 ప్రపంచకప్‌లో ఉన్న ఓ రికార్డు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ…