Harmanpreet Kaur Record: మాజీ దిగ్గజం రికార్డును సమం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్!
- ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం
- 5-0తో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్
- మిథాలీ రికార్డ్ సమం చేసిన హర్మన్‌ప్రీత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన చేసింది. 43 బంతుల్లో 68 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఈ అవార్డుతో హర్మన్‌ప్రీత్ కౌర్ మరో అరుదైన రికార్డును సమం చేసింది. భారత మహిళల టీ20ల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు గెలిచిన క్రికెటర్‌గా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును సమం చేసింది. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్, మిథాలీ ఇద్దరూ టీ20ల్లో భారత్ తరఫున 12 ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు అందుకున్నారు. మిథాలీ 89 టీ20 మ్యాచ్‌లలో 12 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోగా.. హర్మన్ 187 టీ20 మ్యాచుల్లో ఈ ఘనత సాధించింది.
Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
హర్మన్‌ప్రీత్ కౌర్ 2009లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. ఇప్పటివరకు 187 మ్యాచ్‌లు (167 ఇన్నింగ్స్‌లు) ఆడి 3784 పరుగులు చేసింది. టీ20ల్లో ఆమె సగటు 29.33 కాగా.. ఒక సెంచరీతో పాటు 15 అర్ధసెంచరీలు సాధించింది. శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ 130 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో ఆమె స్ట్రైక్‌రేట్ 131.31 కాగా, సగటు 65.00గా ఉంది.
తాజావార్తలు
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!