Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ అనే చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ఇదే. ఈ నేపథ్యంలో పవర్‌స్టార్ అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. గబ్బర్ సింగ్‌ను…
రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీ గురువారం జనం ముందుకు రాబోతోంది. దీని తర్వాత ఈ చిత్ర నిర్మాత శ్రీనివాస చిట్టూరి బ్యానర్ లోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు రామ్. దీని గురించి రామ్ మాట్లాడుతూ, ”నా సినిమాలు హిందీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలానే బోయపాటి గారి సినిమాలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక హీరోను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత…
‘ఇస్మార్ట్ శంకర్’తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నప్పటి నుంచి రామ్ పోతినేని వేగం పెంచాడు. ఒకదాని తర్వాత మరొక క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతున్నాడు. ఆల్రెడీ లింగుసామీ దర్శకత్వంలో చేసిన ‘ద వారియర్’ అనే బైలింగ్వల్ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒప్పందం కుదుర్చుకున్న పాన్ ఇండియా సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లేందుకు ముస్తాబవుతోంది. దీనికితోడు తన వద్దకు వస్తోన్న రకరకాల కథల్ని రామ్ వింటున్నాడు. ఈ క్రమంలోనే ఓ రీమేక్…
‘ఇస్మార్ట్ శంకర్’తో లవర్ బాయ్ నుంచి ఉస్తాద్‌గా అవతరించినప్పటి నుంచీ రామ్ పోతినేని తన స్పీడ్ పెంచాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే లింగుసామీ దర్శకత్వంలో ‘ద వారియర్’ అనే బైలింగ్వల్ కంప్లీట్ చేసిన ఈ ఎనర్జిటిక్ హీరోగా.. త్వరలోనే బోయపాటి శ్రీనుతో సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా మరో సినిమాకి కూడా ఇతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. దర్శకుడు హరీశ్…
గద్దలకొండ గణేశ్ నుంచి దర్శకుడు హరీశ్ శంకర్ ఖాళీగానే ఉన్నాడు. తదుపరి సినిమాపై చాలాకాలం కసరత్తు చేసిన తర్వాత.. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తో గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నాడు. కానీ, ఈ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అవుతోన్నా, ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు. పవన్ తన పొలిటికల్ వ్యవహారాలతో బిజీగా ఉండటం వల్ల, ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. దీనికితోడు ఆయన చేతిలో ఇతర ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఇది…
మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే! చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతోనే అతడు తన స్టార్‌డమ్‌ని పక్కనపెట్టి, చిన్న రోల్ అయినా అది పోషించేందుకు ముందుకొచ్చాడు. ఇప్పుడు అదే సాన్నిహిత్యంతో పవన్ కళ్యాణ్ సినిమాలోనూ ఓ అతిథి పాత్రలో నటించేందుకు సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇటీవల ఓ వెబ్సైట్ ఒక న్యూస్ రాసుకొచ్చింది. ఇదో క్రేజీ న్యూస్ కావడంతో, సోషల్ మీడియాలో వెంటనే వైరల్…
నేచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేయగా.. స్పెషల్ గెస్ట్ గా డైరెక్టర్ హరీష్ శంకర్ విచ్చేశారు. ఇక ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు.. స్టేజి మీద ఉన్న అతిధులను మాట్లాడనివ్వకుండా ఫ్యాన్స్…
భారత చిత్రసీమలో ఇప్పుడున్న మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్‌లో పూజా హెగ్డే ఒకరు. అనతి కాలంలోనే పాన్ ఇండియా నటిగా అవతరించిన ఈమెకు.. వరుసగా క్రేజీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. పైగా.. ఈమె పట్టిన ప్రతీ ప్రాజెక్టూ హిట్టేనని టాక్ ఉండడంతో, ఈమెనే ప్రధానంగా తమ సినిమాల్లో తీసుకోవాలని ఫిల్మ్ మేకర్స్ ఎగబడుతున్నారు. కొందరు ఆమెను లక్కీ చార్మ్‌గా భావించి, రిపీటెడ్‌గా తమ సినిమాల్లో తీసుకుంటున్నారు కూడా! అలాంటి ఫిల్మ్ మేకర్స్‌లో హరీశ్ శంకర్ ఒకరు. పూజాతో కలిసి చేసిన…
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇటీవలే ‘హరిహరవీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా తరువాత వెంటనే ‘భవదీయుడు భగత్ సింగ్’ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ కాంబోలో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా లైన్లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా ఒకటి. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్ కలిసి ఈ సినిమా చేస్తుండడంతో.. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే.. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అవుతున్నా, ఇంకా కార్యరూపం దాల్చుకోలేదు. ప్రీ-ప్రొడక్షన్ పనులైతే జరుగుతున్నాయని మేకర్స్ చెప్తున్నారు కానీ, ఇదెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్నదే స్పష్టత లేదు. ప్రస్తుతం చేస్తోన్న ప్రాజెక్టులు, రాజకీయ వ్యవహారాల నుంచి…