Ustaad Bhagat Singh: హమ్మయ్యా… మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తొలి షెడ్యూల్ పూర్తయిపోయింది. ‘భవదీయుడు భగత్ సింగ్’ గా ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలైందో కానీ పాపం… పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దర్శకుడు హరీశ్ శంకర్ ను అలా ఇలా ఆడుకోలేదు. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ ను తమ హీరోకు ఇచ్చాడనే అభిమానం కూడా లేకుండా దారుణంగా హరీశ్ శంకర్ ను ట్రోల్ చేశారు. ఇక ఈ సినిమా పేరు మారడం, ఇదో తమిళ సినిమాకు రీమేక్ అనే ప్రచారం జరగడంతో ఆ ట్రోలింగ్ పీక్స్ కు చేరుకుంది. ఒకానొక దశలో హరీశ్ శంకర్ మూవీ ఉండదనే ప్రచారమూ భారీగా సాగింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ వేరు ప్రాజెక్ట్స్ ను సెట్స్ పైకి తీసుకు రావడంతో అభిమానులు చేసిన ప్రచారం నిజమేనేమో అనే సందేహమూ కొందరికి వచ్చింది. అయితే వాటన్నింటినీ త్రోసి రాజంటూ ఈ సినిమా ఇటీవల సెట్స్ పైకి ఎక్కేసింది. అంతేకాదు… ఎనిమిది రోజుల పాటు జరిగిన తొలి షెడ్యూల్ ఇప్పుడు పూర్తయ్యింది కూడా.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ తొలి షెడ్యూల్ లో స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ వెయ్యి మంది కి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. అలానే పలువురు పిల్లలతో వినోదభరితమైన సన్నివేశాలు చిత్రీకరించారు. హీరో, హీరోయిన్లు పవన్ కళ్యాణ్, శ్రీలీల పై రొమాంటిక్ సన్నివేశాలను, భారీగా రూపొందించిన పోలీస్ స్టేషన్ సెట్‌లో మరికొన్ని కీలక సన్నివేశాలను పిక్చరైజ్ చేశారు. ఇందులో నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, ‘టెంపర్’ వంశీ, నవాబ్ షా, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్ తదితరులు నటించారు. మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాల పట్ల చిత్ర బృందం సంతృప్తిగా ఉంది. బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంచనాలకు మించి అలరిస్తుందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ప్రీ-ప్రొడక్షన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అదిరిపోయే డైలాగ్స్, స్పెల్-బౌండింగ్ మేనరిజమ్‌లతో పవన్ కళ్యాణ్‌ను విభిన్న కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోస్టర్లు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో నిండిన కథతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్ ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా అయనంకా బోస్, ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్… ఇలా అగ్రశ్రేణి సాంకేతిక బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది. ‘గబ్బర్ సింగ్’ కోసం మెమరబుల్ ఆల్బమ్ ని అందించిన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, మరో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నారని చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి తెలిపారు.
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!