Raviteja: పవన్ డైరెక్టర్ ని అడ్డంగా బుక్ చేసిన మాస్ మహారాజా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ తో మంచి జోష్ లో ఉన్నాడు. హ్యాట్రిక్ హిట్ కోసం ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి ‘రావణాసుర’గా రానున్నాడు రవితేజ. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ని మాస్ మహారాజా ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు. రావణాసుర రిలీజ్ కి మరో 48 గంటలు మాత్రమే ఉండడంతో అభిమానులతో చాట్ సెషన్ నిర్వహించాడు రవితేజ. #AskRavanasura పేరుతో నిర్వహించిన చాట్ సెషన్లో ఫాన్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పిన రవితేజ, రావణాసుర సినిమా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ని అభిమానులకి ఇచ్చాడు. ఈ చాట్ సెషన్ లో ఒక అభిమాని హరీష్ శంకర్‌తో మరొక సినిమా చేయాలని రవితేజను రిక్వెస్ట్ చేశాడు. వేరే హీరో అయితే చూద్దాం, చేద్దాం, కథ కుదరాలి లాంటి సమాధానాలు చెప్తాడు కానీ అక్కడ ఉన్నది రవితేజ కదా అందుకే సూపర్బ్ ఆన్సర్ ఇస్తూ హరీష్ శంకర్ ని ఇరికించాడు.
అభిమాని రిక్వెస్ట్ కి తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన రవితేజ “ఏమ్మా హరీష్.. ఏదో అడుగుతున్నారు నిన్నే” అంటూ హరీష్ శంకర్ ని డైరెక్ట్ ట్యాగ్ చేశాడు. ఈరోజు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పనుల్లో బిజీగా ఉన్నా కూడా హరీష్ శంకర్, రవితేజ ట్వీట్ కి వెంటనే రెస్పాండ్ అయ్యాడు. “అన్నయ్యతో సినిమా చేసేందుకు ఎప్పుడూ రెడీ. నిజానికి ఒక పీరియడ్ డ్రామాపై (Periodic Drama) వర్క్ చేస్తున్నాను. అతి త్వరలోనే హిస్టరీ రిపీట్ చేయబోతున్నాం. థాంక్యూ అన్నయ్య” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో మాస్ మహారాజా ఫాన్స్ అంతా జోష్ లోకి వచ్చి కామెంట్స్ చేస్తున్నారు. హరీష్ శంకర్ లోని దర్శకుడిని అందరికన్నా ముందు గుర్తించిన రవితేజ, షాక్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఆ మూవీ ఫ్లాప్ అయ్యి హరీష్ శంకర్ కి మరో సినిమా దొరకకపోతే… ఏం పర్లేదు, ఇంకో కథ చేసుకోని రా, సినిమా చేద్దాం అని కాన్ఫిడెన్స్ ఇచ్చాడు రవితేజ. అక్కడి నుంచి మిరపకాయ్ సినిమా బయటకి వచ్చింది. సూపర్ హిట్ అయిన ఈ మూవీ తర్వాత రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా పడలేదు. మరి రవితేజతో హ్యాట్రిక్ సినిమా కోసం హరీష్ శంకర్ ఎలాంటి కథని రెడీ చేస్తున్నాడు? ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందా అనే విషయాలు తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read
- Spirit: రణ్‌బీర్ లీక్.. సందీప్ ప్లాన్.. ‘స్పిరిట్’ విషయంలో జరిగింది ఇదేనా!
- CBFC Data Leak: సెన్సార్ బోర్డ్‌లో భారీ డేటా లీక్! 500 సినిమాల స్క్రిప్ట్‌లు ఆన్లైన్లో ప్రత్యక్షం..
- Idupu Kayitham : బంతి భోజనాల్లో 'మందు' కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
- మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
Annaya @harish2you anna tho oka movie set chey annaya 😌#AskRavanasura
— RajKumar (@rjkumarb1) April 4, 2023
Emmaaa @harish2you edho aduguthunnaru ninne…#AskRavanasura #Ravanasura#RavanasuraOnApril7 https://t.co/3xcQS3JPcK
— Ravi Teja (@RaviTeja_offl) April 4, 2023
Ha ha ha ha ha
Annaya tho always ready in fact working on a period drama …. Very Soon We r going to repeat history … thank you annayya @RaviTeja_offl 🤗🤗🤗🤗 https://t.co/5pppddUzJP— Harish Shankar .S (@harish2you) April 4, 2023
తాజావార్తలు
-
Cyclone Arnab : కోస్తాంధ్రను వణికించనున్న ‘అర్నాబ్’.. హైఅలర్ట్ జారీ చేసిన ఐఎండీ
-
Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
Spirit: రణ్‌బీర్ లీక్.. సందీప్ ప్లాన్.. ‘స్పిరిట్’ విషయంలో జరిగింది ఇదేనా!
-
Maharashtra: RSS ర్యాలీ, రాళ్లదాడి.. మహారాష్ట్ర జల్గావ్లో ఉద్రిక్తత.!
ట్రెండింగ్
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే