మేడిగడ్డకు రిపేర్ చేయాలని నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇస్తే రిపేర్లు చేస్తాం.. కేసీఆర్ చదివింది కేవలం బీఏనే.. పార్లమెంట్ ఎన్నికల్లో పీజీ చేసినట్టు సమాచారం ఇచ్చాడు.. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులే మేడిగడ్డలో దొంగలు.. ఈ దొంగల సలహాలు తీసుకొని రిపేర్లు చేయమంటారా అంటూ సీఎం అడిగారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ పర్యటనలో భాగంగా ఇవాళ అన్నారం బ్యారేజీ వద్ద బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పడగొట్టాలంటే కాళేశ్వరం పడగొడితే సరిపోతుంది అని రేవంత్ ఆలోచన లా కనిపిస్తుందన్నారు. అసలు కేసిఆర్ నే లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదింప చేసిన విషయం మీకు తెలిసిందే. గత ఏడాది చివరి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన ఆర్టీసీ విలీన బిల్లును కొన్ని వివరణలు కోరుతూ, గవర్నర్ మొదట ఆమోదించలేదు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో…
Mahesh kumar Goud: మంత్రి ఉత్తమ్ ప్రసెంటిషన్ తో హరీష్ రావు దిమ్మతిరిగి పోయిందని ఎమ్మెల్సీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగాయి. అయితే.. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కేఆర్ఎంబీకి అప్పగించబోని చెప్పించింది బీఆర్ఎస్ అని ఆయన అన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ విజయమని, మేము గొంతు విప్పాకే అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరి నిలదీశామని, ప్రతిపక్షం మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. వారి పిపిటి తప్పుల…
తెలంగాణ అసెంబ్లీలో అధికార- ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. శాసనసభలో ఇవాళ నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం ప్రవేశ పెట్టాగా.. దానిపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండగానే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కల్పించుకున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే నీటిరంగంపై చర్చ కొనసాగాలని తెలిపారు. పాపాల భైరవుడు కేసీఆర్ను సభకు పిలవాలి అని ఆయన కోరారు.
కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ కళంకంగా మారింది.. ప్రజలను నమ్మి పదేళ్లు అధికారం ఇస్తే తెలంగాణను నిండా ముంచారు.. కూలిన ప్రాజెక్టును చూసి మీరు సిగ్గుపడాలి అంటూ ఆయన వ్యాఖ్యనించారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటెషన్ ఇచ్చింది. దీనిపై దీర్ఘకాలిక చర్చలో భాగంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.