Jupally Krishna Rao: చర్చకు సిద్దమా..? హరీష్ రావుకు జూపల్లి సవాల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jupally Krishna Rao: పాలమూరు ఎత్తిపోతల పథకానికి కాలువలు తొవ్వకుండానే కేసీఆర్ ప్రాజెక్టు ప్రారంభించారని, హరీష్ రావు ఎక్కడికి వస్తావో చెప్పు ఎక్కడైనా చర్చకు సిద్ధమని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్ళలో ప్రజాధనం దోచుకుతిన్నారని మండిపడ్డారు. మళ్ళీ దోచుకునేందుకు హరీష్ రావు సచివాలయం ముట్టడి అంటున్నారని తెలిపారు. నీటి ఎద్దడికి బీఆర్ఎస్ కారణమని క్లారిటీ ఇచ్చారు. నీటి నిల్వలను ముందే ఎందుకు పెంచలేదు? అని ప్రశ్నించారు. వర్షాకాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. పంట నష్టం పై ప్రభుత్వం సర్వే చేస్తుందన్నారు.
పంట నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారైనా పంట నష్ట పరిహారం ఇచ్చారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పరిపాలనలో 6 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. వచ్చే వానాకాలం నుంచి అన్ని పంటలకు ప్రభుత్వమే భీమా సౌకర్యం కల్పింస్తుందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి కాలువలు తొవ్వకుండానే కేసీఆర్ ప్రాజెక్టు ప్రారంభించారన్నారు. హరీష్ రావు ఎక్కడికి వస్తావో చెప్పు… ఎక్కడైనా చర్చకు సిద్ధంమని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలకు ముందుంది ముసళ్ళ పండగా… అందరి బాగోతాలు బయటపడుతాయన్నారు.
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
Read also: Madhusudhan Reddy: బొజ్జలపై మధుసూదన్ రెడ్డి ఫైర్.. కేసు పెట్టాలి..!
కాంగ్రెస్ ప్రభుత్వంపై తాజాగా మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర పనులు చేస్తోందని మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో పర్యటన చేసినప్పుడు రైతుల కళ్లల్లో ఆవేదన.. కన్నీళ్లు చూశామని తెలిపారు. సత్తమ్మ అనే మహిళ నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదని.. పైగా నాలుగు లక్షల రూపాయలు అప్పు అప్పు అయినట్లుగా ఆమె చెప్పిందని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో అయితే ఒక్క గుంట కూడా ఎండ లేదని గుర్తుచేశారు.
సంగారెడ్డి జిల్లాలో రైతులకు బ్యాంకులు నోటీసులు పంపి లోన్ కడతారా? లేదా? అని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాణస్వీకారం చేయగానే రుణమాఫీ చేస్తామని.. అది కూడా డిసెంబర్ 9నే చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని గుర్తుచేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కారం చేయకపోతే రాష్ట్రంలోని లక్షలాది రైతులతో కలిసి సచివాలయం ముట్టడి చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించిన విషయం తెలిసిందే..
Madhusudhan Reddy: బొజ్జలపై మధుసూదన్ రెడ్డి ఫైర్.. కేసు పెట్టాలి..!
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!