Komatireddy Venkat Reddy: హరీష్ రావు సీఎం కావడానికి ప్లాన్ లో ఉన్నట్టున్నాడని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana Assembly: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మీడియా పాయింట్ వద్దకు బీఆర్ఎస్ సభ్యులు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడే వున్న పోలీసులు బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్నారు.
శాసన సభ జరిగిన జరుగుతున్న తీరు ఖండిస్తున్నాను అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మీరు మాట్లాడి, మాకు మైకులు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధం అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. హరీష్, కడియం లాగా.. మేము జి హుజూర్ బ్యాచ్ కాదన్నారు. కడియం, హరీష్ లు మమ్మల్ని చిల్చాలను గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారని, మేము పదవుల కోసం కాదు.. ప్రజల కోసం ఉండేవాళ్ళమన్నారు. బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలని ఆయన హితవు పలికారు.…
రాష్ట్ర అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన ఈ ఏడాది బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కేటాయింపులు చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2024-25 బడ్జెట్లో రూ.4,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ బడ్జెట్లో కేవలం రూ.2,200 కోట్లు కేటాయించిందని హరీష్ రావు గుర్తు చేశారు. ఆదివారం సిద్దిపేట నుంచి ఉమ్రా యాత్రకు వెళ్తున్న ముస్లింలకు హరీష్ రావు పంపిణీ చేస్తూ.. తన సొంత ఖర్చులతో ఏటా 10 మంది పేద ముస్లింలను…
బడ్జెట్ అన్ని వర్గాల వారిని నిరాశ పరిచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వాగ్దాన భంగంకు బడ్జెట్ అద్దం పడుతుందన్నారు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా బడ్జెట్ ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై హరీశ్రావు మాట్లాడారు.
ఎస్ఎల్బీసీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. పదేళ్లలో కిలోమీటర్ తవ్వారని ఇటీవల ప్రెస్మీట్లో రేవంత్ చెప్పారని.. కానీ తమ హయాంలో 11 కిలోమీటర్లు తవ్వామని తెలిపారు. తాము విమర్శలు చేయాలంటే చాలా చేస్తాం.. కానీ మైక్ కట్ అవుతుందని తెలిపారు. ఎన్నికలు జరిగే రోజు ఏపీ పోలీసులు అన్యాయంగా వచ్చారన్నారు. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్లో, నాగార్జున సాగర్ తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుందని... కానీ…
ఒక విజన్ లా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం అందరినీ నిరాశపరిచింది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం ఏ చేస్తుందొ గవర్నర్ ప్రసంగంలో ఉండాలన్నారు. ఆసరా పెన్షన్ , మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తామో తెలపనీ ప్రసంగం నిరాశ పరిచింది..
హరీశ్ రావు బీఏసీ సమావేశానికి రావడంతో మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పీకర్ దృష్టికి కేసీఅర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. లెటర్ కేసీఆర్ నుంచి రావాలి కదా.. లెటర్ ఇవ్వకుండా అనుమతి ఇచ్చేది లేదు..ఈ ప్రతిపాదనకు తాము అంగీకరించలేదని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి మితి మీరిన అహంకారంతో మాట్లాడారని, వితండ వాదం చేశారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీచమైన పద్ధతి లో కేసీఅర్ పై వ్యక్తిగత దూషణలు చేశారు రేవంత్ అని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం మేము KRMBకి ప్రాజెక్ట్ లు అప్పజెప్పామని రంకెలు వేస్తుందని, KRMB మీటింగ్ లో ప్రాజెక్ట్ లు అప్పగించేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుందన్నారు హరీష్ రావు. రెండు…