IC 814 హైజాక్ సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ సిరీస్ లో టెర్రరిస్టుల పేర్లపై వివాదం కొనసాగింది. కాగా.. దీనికి సంబంధించిన తాజా వార్త చక్కర్లు కొడుతోంది. చండీగఢ్‌లోని మణిమజ్రాకు చెందిన పూజా కటారియా తన భర్తతో కలిసి ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. హనీమూన్ కోసం పూజ తన భర్తతో కలిసి నేపాల్ వెళ్లింది. ఈ సమయంలో.. విమానం ఖాట్మండు నుంచి ఢిల్లీకి తిరిగి వస్తుండగా.. హైజాక్ చేయబడింది. చండీగఢ్‌లోని మణిమజ్రాలోని మోడరన్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న పూజా కటారియా ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. తాను ఈ సినిమా చూశానని, సిరీస్ చూశానని అందులో వాడిన పేర్లు హైజాక్ సమయంలో తాను విన్న పేర్లేనని పూజ చెప్పారు. తన భర్తతో కలిసి విమానంలో ఉన్నానని.. ఈ విమానాన్ని ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ చేశారని తెలిపారు. ఆ సమయాన్ని గుర్తు చేసుకుంటూ.. ఫ్లైట్ లో మొదటి రెండు రోజులు చాలా టెన్షన్‌తో గడిపామని గుర్తు చేసుకున్నారు. కానీ ఉగ్రవాదుల్లో ఒకడు చాలా స్నేహపూర్వకంగా ఉన్నాడని చెప్పారు. అతను సరదాగా పాటలు పాడేవాడన్నారు. డాక్టర్ పేరుతో పిలిచే ఆ ఉగ్రవాది ఇస్లాంలోకి మారమని చెబుతుండేవాడని చెప్పారు. ఇస్లాం మతం చాలా మంచిదని మరీ మరీ చెప్పేవాడన్నారు. .
READ MORE: CM Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఫైర్.. అమరావతి మునిగిందా..? వీళ్లను పూడ్చాలి..!
పుట్టిన రోజున బహుమతి..
ఈ విమానం 1999 డిసెంబర్ 24న హైజాక్ చేయబడింది. ఆ రోజు పూజా పుట్టినరోజు.. ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ.. “మమ్మల్ని విడిచిపెట్టమని ఉగ్రవాదులకు చెప్పాం. ఈ రోజు నా పుట్టినరోజు అని వారితి చెప్పా. దీనిపై డాక్టర్ అనే ఉగ్రవాది స్పందించాడు. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఓ శాలువాను కూడా ఇచ్చాడు. దానిపై నాప్రియమైన సోదరి పూజా, ఆమె అందమైన భర్త అని అందులో పొందుపరిచాడు. ఉగ్రవాది తన పేరును డాక్టర్ అని రాసి తేదీని కూడా పేర్కొన్నాడు. ఇది ఇప్పటికీ నా వద్దే ఉంది. ఇది కాకుండా అప్పుడు నేను వినియోగించిన పెప్సీ డబ్బా కూడా నాతోనే ఉంది. ” అని పూజా పేర్కొంది.