ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా 2012లో జూలై 6న విడుదలై విజయవంతంగా నడుస్తున్న సమయంలోనే ‘అందాల రాక్షసి’ మూవీ కూడా విడుదలైంది. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్ర నిర్మాణంలో ఎస్. ఎస్. రాజమౌళి సైతం భాగస్వామిగా వ్యవహరించారు. ఈ సినిమాతో హీరోహీరోయిన్లుగా నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠితో పాటు దర్శకుడిగా హను రాఘవపూడి పరిచయం అయ్యాడు. సో… వీళ్ళందరూ ఆగస్ట్ 10వ తేదీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 10…
‘మహానటి’తో టాలీవుడ్ అరంగేట్రం చేసిన దుల్కార్ సల్మాన్.. హను రాఘవపూడి దర్శకత్వంలో రెండో తెలుగు సినిమా చేస్తున్నాడు. సీతారామం అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి పాజిటివ్ వైబ్స్ మూటగట్టుకున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ టీజర్ వచ్చింది. ఎవరూ లేని రామ్ అనే ఓ ఒంటరి సైనికుడు, అతని ప్రేమలో పడే సీత అనే అమ్మాయి చుట్టూ.. ఓ అందమైన…
నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఇక ఈ మధ్యకాలంలో పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ‘సీతారామం’ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం విదితమే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీతారామం’. వైజయంతి మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్ నిర్మిస్తుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియోస్…
దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ఈ మూవీ ఉపశీర్షిక. మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న ఓ కీలకపాత్రలో కనిపించబోతోంది. ఇందులో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తుండగా, ఆఫ్రీన్ అనే ముస్లిం మహిళ పాత్రను రష్మిక పోషిస్తోంది. వెటరన్ సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ ఛాయాగ్రహణం అందిస్తున్న ‘సీతారామం’కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం…
తెలుగు పరిశ్రమ సెంటిమెంట్ కి పెద్ద పీట వేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎదో ఒక సెంటిమెంట్ ని నమ్ముతుంటారు. ఇలాంటి సెంటిమెంటల్ వాతావరణంలో ఓ దర్శకుడు తన నటీనటులు, సిబ్బందికి జ్యోతిష్యం చెబుతూ తన విద్యను ప్రదర్శిస్తున్నాడు. అతడెవరో కాదు ‘అందాల రాక్షసి’తో దర్శకుడుగా మారిన హను రాఘవపూడి. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో సినిమా తీస్తున్న ఇతగాడికి జ్యోతిష్యం బాగా పట్టిందట. తనను కలసిన నటీనటులకు, సన్నిహితులకు ముందుగా జ్యోతిష్యం చెబుతూ ప్రతిభను చాటుతున్నాడట.…
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తెలుగు టాప్ హీరోయిన్లలో ఒకరు. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉంది ఈ కన్నడ సోయగం. ఆమె తెలుగు లో ఇప్పుడు ఆమె నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఇక రష్మిక మందన్న తన తరువాత చిత్రానికి…
మాలీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ రొమాంటిక్ వార్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘లెఫ్టినెంట్ రామ్’ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ వార్ డ్రామాలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి పేరును వెల్లడించారు. ఆమె మరెవరో కాదు మృణాల్ ఠాకూర్. నిన్న మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ ప్రేయసిగా ఈ చిత్రంలో ఆమె…
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. దుల్కర్ సల్మాన్ ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా నుంచి ఓ వీడియోను రిలీజ్ చేసారు. హను రాఘవపూడి దర్శకత్వంలో “లెఫ్టినెంట్ రామ్” అనే టైటిల్ తో మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరో ఇంట్రో టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో “లెఫ్టినెంట్ రామ్”గా దుల్కర్ సల్మాన్…
‘అందాల రాక్షసి’ తో తొలిసారి మెగా ఫోన్ పట్టిన హను రాఘవపూడి ఇంతవరకూ తన ఖాతాలో సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని అయితే వేసుకోలేదు. ఆ తర్వాత నానితో తెరకెక్కించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ హిట్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. నితిన్ ‘లై’, శర్వానంద్ ‘పడిపడి లేచే మనసు’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయినా ఫిల్మ్ మేకర్ గా హను రాఘవపూడికి మంచి గుర్తింపే వచ్చింది. ప్రస్తుతం స్వప్న సినిమాస్ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా…
మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ భారీ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందనున్నట్టు కొంతకాలం క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి “లెఫ్టినెంట్ రామ్” అనే టైటిల్ ను కూడా ఇప్పటికే ప్రకటించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం దుల్కర్ సల్మాన్ నిర్మాతలు ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అక్కినేని సుమంత్ ను…