నటశేఖర కృష్ణ హీరోగా దర్శకుడు కె.ఎస్.ఆర్. దాస్ తెరకెక్కించిన అనేక చిత్రాలు మాస్ ను విశేషంగా అలరించాయి. ఆ కోవకు చెందిన చిత్రమే ‘హంతకులు – దేవాంతకులు’. ఎస్.ఆర్.కంబైన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం 1972 జూన్ 2న విడుదలై జనాన్ని ఆకట్టుకుంది. ‘హంతకులు – దేవాంతకులు’ కథ ఏమిటంటే – రాజేశ్ సి.ఐ.డి. – అచ్చు అతనిలాగే ఉండే అతని అన్నను, అతని తల్లిని బలరామ్, లైలా, ప్రేమ్ అనే దుండగులు చంపేసి, డబ్బు దోచుకుంటారు.…