గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న అమెరికా పౌరుల కోసం వైట్‌హౌస్ రహస్యంగా చర్యలు జరిపినట్లు తెలుస్తోంది. అమెరికన్ బందీలను విడుదల చేయాలని హమాస్‌ను అమెరికా అధికారులు కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు సమాచారం ఇవ్వకుండానే.. ఈ చర్చలు జరిపినట్లుగా సమాచారం.
Israel Hamas: ఇజ్రాయిల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ తొలి దశ ముగింపుకు వస్తోంది. అయితే, ఈ దశలో చివరి షెడ్యూల్లో భాగంగా శనివారం ఆరుగురు ఇజ్రాయిలీలను విడుదల చేసింది. మొత్తం మీద ఈ దశలో 33 మంది ఇజ్రాయిలీలను హమాస్ విడుదల చేసింది. ఇందులో ఐదుగురు థాయ్‌లాండ్ బందీలు కూడా ఉన్నారు.
మొత్తానికి ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీలు-ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయింది. తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్.. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తుండగా.. ఇజ్రాయెల్.. పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తోంది.
Bomb Blast: ఆగి ఉన్న మూడు బస్సులలో వరుస పేలుళ్లు సంభవించడంతో సెంట్రల్ ఇజ్రాయెల్ దద్దరిల్లింది. ఇది ఉగ్రవాద దాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరూ గాయపడినట్లు, మరణించినట్లుగాను నివేదిక లేదు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ గాజా నుండి నలుగురు బందీల మృతదేహాలను తిరిగి ఇచ్చిన తర్వాత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్‌కు ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఇజ్రాయెల్ బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని హమాస్‌కు ట్రంప్ అల్టిమేటం విధించారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి కాలుదువ్వుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌లోని అణుస్థావరాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు అమెరికా నిఘా వర్గాలు నివేదించాయి.
పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండం అయ్యేలా కనిపిస్తోంది. ఏడాదికి పైగా ఇజ్రాయెల్ చేసిన దాడులతో గాజా నేలమట్టం అయింది. వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
గాజాను స్వాధీనం చేసుకుని తీరుతామని మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తాజా పరిణామాలపై జోర్దాన్ రాజు అబ్దుల్లాతో ట్రంప్ చర్చించారు. గాజాను కొనాల్సిన అవసరం లేదని.. దానిని స్వాధీనం చేసుకుని తీరుతామని ట్రంప్ వెల్లడించారు.
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హమాస్-లెబనాన్-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది.