ఈజిప్టు వేదికగా గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. సోమవారం షర్మ్ ఎల్ షేక్‌లో అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సీసీ ఆధ్వర్యంలో శాంతి శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంయుక్తంగా ఆహ్వానించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ఇజ్రాయెల్‌కు బయల్దేరారు. అమెరికా నుంచి ఇజ్రాయెల్ బయల్దేరే సమయంలో మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ ఎయిర్‌పోర్టులో కుండపోత వర్షం కురుస్తోంది. ఓ వైపు ఈదురుగాలులు.. ఇంకోవైపు భారీ వర్షం.. ఇక చేసేదేమీలేక కారులోంచి కిందకు దిగి గొడుగుతో ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఎక్కేందుకు ప్రయత్నించారు.
దాదాపు రెండేళ్ల తర్వాత హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా సోమవారం మూడు విడతలుగా బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలి విడతగా ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది.
ఒక్కరోజు కాదు.. రెండ్రోజులు కాదు. ఏకంగా రెండేళ్లు చెరలో బందీలుగా ఉండిపోయారు. ఏదో రోజు తిరిగి వస్తారని ఎదురుచూసిన ఎదురుచూపులకు నిరీక్షణ ఫలించింది. సోమవారం తొలి విడత బందీలను హమాస్ విడుదల చేసింది. దీంతో ఇజ్రాయెల్ అంతటా పండుగ వాతావరణం నెలకొంది.
గాజాలో పాలన పాలస్తీనీయుల చేతుల్లోనే ఉండాలని హమాస్, పాలస్తీనా వర్గాలు కీలక ప్రకటన విడుదల చేశాయి. ఏదైనా బాహ్య జోక్యాన్ని గానీ విదేశీయుల ఆదిపత్యాన్ని గానీ అంగీకరించబోమని పేర్కొంది.
గాజా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నేటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఇంకా నాశనం కాలేదని.. యుద్ధం ముగించడానికి దగ్గరగా ఉన్నట్లు తెలిపారు.
ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన తొలి రౌండ్ పరోక్ష చర్చలు సానుకూల వాతావరణంలో ముగిసినట్లుగా తెలుస్తోంది. గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు.
అక్టోబర్ 7, 2023 ఎవరూ మరిచిపోలేని రోజు. ప్రపంచమంతా ఉలిక్కిపడ్డ రోజు. హమాస్ ముష్కరులు ఊహించని రీతిలో ఇజ్రాయెల్‌లోకి చొరబడి 1,200 మందిని చంపి దాదాపు 251 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన ఇజ్రాయెల్‌నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి మంగళవారంతో రెండేళ్లు పూర్తవుతుంది. అనంతరం గాజాపై ఏకధాటిగా యుద్ధం చేస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. దీనికి ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ అంగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈజిప్టు వేదికగా సోమవారం కీలక సమావేశం జరగబోతుంది. ఈజిప్టు రాజధాని కైరోలో చర్చలు జరగనున్నాయి.