ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగ నిప్పులు కక్కుతున్నాడు. ఐఎండీ సూచనల ప్రకారం.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈసారి ఎక్కువ రోజులపాటు వడగాల్పులు వీయవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు.
Weather Updates : ఉత్తర భారత వాతావరణం మరోసారి మలుపు తిరిగింది. పశ్చిమ కల్లోల ప్రభావంతో గత రెండు రోజులుగా యూపీ, ఢిల్లీ, హర్యానా సహా ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నాయి.
TS Weather : ఓ వైపు ఎండలు మండుతున్నాయి.. అదే క్రమంలో వాతావరణం చల్లగా మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు మూడు రోజులుగా ఇదే పరిస్థితి రాష్ట్రంలో తలెత్తింది. దీంతో జనాలు ఎప్పుడు వాన పడుతుందో.. ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియక అయోమయంలో ఉన్నారు.
గత వారం పది రోజులుగా ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. కానీ నేడు తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీలో వేసవి తాపం మొదలైపోయింది. వారం రోజుల నుంచి పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. మంగళ, బుధవారాల్లో కూడా వడగాల్పులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని 20 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలలోని…
తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు… మరికొన్ని ప్రాంతాల్లో గాలివానలు భయపెడుతున్నాయి. ఈ వర్షాలకు ఇప్పటికే పంటలు బాగా దెబ్బతిన్నాయి. మరికొన్ని రోజుల పాటు వర్షాలు తప్పవని అధికారులు తెలిపారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దట్టంగా మంచు కురిసే వేళలో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ వానలు పడుతున్నాయి. అకాలంలో పడుతున్న ఈ వర్షాలు… రైతులకు అపార నష్టాన్ని మిగిలుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర…