Hafiz Saeed: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ హతమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ జీలం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన దాడుల్లో అతడి మేనల్లుడు అబూ ఖతత్ మరణించాడు. అయితే, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హఫీస్ సయీద్ రావల్పిండిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, చికిత్స తీసుకుంటూ మరణించినట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ సింఘి పాకిస్తాన్‌లో హతమయ్యాడు. శనివారం రాత్రి 8 గంటలకు అబూ ఖతల్‌ను ఉరితీశారు. అతను భారత్ లో దాడులకు పాల్పడ్డాడు. NIA అతన్ని వాంటెడ్‌గా ప్రకటించింది. అబూ ఖతల్.. హఫీజ్ సయీద్ కు సన్నిహితుడిగా గుర్తించబడ్డాడు. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసిలోని శివ-ఖోడి ఆలయం నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. Also Read: Chandrababu Naidu: మనం నిత్యం…
Masood Azhar: నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ చీఫ్, 2001 భారత పార్లమెంట్ దాడి సూత్రధారి మసూద్ అజార్ దాయాది దేశం పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇటీవల పాకిస్తాన్ బహవాల్ పూర్‌లో ఒక ఇస్లామిక్ సెమినరీలో అజార్ ప్రసంగించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీంట్లో అతను భారతదేశంపై దాడులు కొనసాగిస్తామని చెప్పడం, ప్రధాని నరేంద్రమోడీపై అవమానకరమైన పదాలను ఉపయోగించడం కనిపించింది. దీంతో పాకిస్తాన్ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Pakistan elections: ముంబై దాడుల సూత్రధారి, జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీస్ సయీద్ కొడుకు తల్హా సయీద్ ఈ పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఉగ్రవాది కొడుకు ఎన్నికల్లో పోటీ చేయడం భారత్‌లో చర్చనీయాంశం అయింది. పాకిస్తాన్ నగరం లాహోర్ నుంచి పోటీ చేసిన తల్హా సయీద్ తాజా ఎన్నికల్లో ఓడిపోయాడు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలు ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అభ్యర్థి గెలుపొందాడు.
లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు., ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను తమకు అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను అధికారికంగా అభ్యర్థించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Pakistan: పాకిస్తాన్‌లో అసలేం జరగుతోంది. ఎవరికీ అంతుచిక్కకుండా గుర్తు తెలియని వ్యక్తులు భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని లేపేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులు ఇలాగే చంపివేయబడ్డారు. తాజాగా మరో ఉగ్రవాదిని లేపేశారు. లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకరైన ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ని కరాచీ నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
Hafiz Saeed: ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్ కొడుకు కమాలుద్దీన్ హత్యకు గురైనట్లుగా వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 27న కమాలుద్దీన్ సయూద్ని గుర్తు తెలియని వ్యక్తుల పెషావర్ నుంచి కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అతన్ని హత్య చేశారని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
Hafiz Saeed: దాయాది దేశం పాకిస్తాన్ లో ఏదో జరుగుతోంది వరసగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమవుతున్నారు. దీంతో అక్కడ ఉన్న ఉగ్రవాదుల్లో భయం మొదలైంది. రెండుమూడు రోజుల క్రితం జియావుర్ రెహ్మన్ అనే హిజ్బుల్ ముజాహిద్ధీన్ ఉగ్రవాదిన కరాచీలో హతమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తుల వచ్చి ఆయన్ని హతమార్చారు. కాశ్మీర్ లో హిజ్బుల్ తరుపున ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేసే పనిని ఈ ఉగ్రవాది చేసేవాడు.
Efforts to sanction terrorists behind 26/11 blocked for political reasons, says india: యావత్ భారతాన్ని భయాందోళకు గురి చేశాయి 26/11 ముంబై దాడులు. దాడులు జరిగి 14 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికే ప్రధాన సూత్రదారులైన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్ లో దర్జాగా తిరుగుతున్నారు. దాయాది దేశం పాకిస్తాన్ చర్యలు తీసుకోవడం లేదు. దాడిలో పాల్గొని దొరికిన ఒకే ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను భారతప్రభుత్వం ఉరి తీసింది. అయితే…