దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఇన్ ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ ఇదివరకు లేఖ రాసింది.
H3N2 Influenza Virus: దేశవ్యాప్తంగా హెచ్3ఎన్2 వైరస్ ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది.. పలు రాష్ట్రాల్లో ఈ కేసులు ఇప్పటికే వెలుగు చూశాయి.. ఆంధ్రప్రదేశ్‌లోనూ అక్కడక్కడ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. అయితే, హెచ్3ఎన్2 రాష్ట్రంలో అదుపులోనే ఉంది.. ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు మంత్రి విడదల రజనీ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. జ్వరం తర్వాత కొద్దీ రోజులు పొడి దగ్గు వేధిస్తోంది.. వైరల్ జ్వరాలకు సాధారణ వైద్య సేవలు సరిపోతాయన్నారు.. ఇక, కేంద్రం మార్గదర్శకాలను…