అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు. లేపాక్షి అంటే తెలుగు సంస్కృతికి భారతీయ సంస్కృతికి పవిత్రతకు మారుపేరు. రాష్ట్ర ప్రభుత్వం లేపాక్షి ఆలయాన్ని కానీ దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. లేపాక్షి ఆలయానికి నందికి ఆనుకుని హైవే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం మొండికేసినప్పుడు దాన్ని తానే ఆపానన్నారు. లేపాక్షి ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద చేర్చాలి, అవసరమైతే దీని కోసం నేను పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తాను. వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద లేపాక్షి ఆలయాన్ని చేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
అనంతపురం పర్యటనలో ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీకి అమరావతే రాజధాని అని, కేంద్రం వైఖరి అదేనని కుండబద్ధలు కొట్టారు. ఏపీ అప్పుల ఊబిలో చిక్కుకుందన్నారు జీవీఎల్. 20 ఏళ్ళుగా చేసిన అప్పులకంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్ల పాలనలోనే రెట్టింపు అప్పులు చేశారని జీవీఎల్ మండిపడ్డారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ. 25,800 కోట్లు ఖర్చు చేసిందని జీవీఎల్ తెలిపారు.