నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, విలక్షణ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ కలయికలో ఓ భారీ పీరియాడికల్ చిత్రం రూపొందనుంది. 1930-40 నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ కానుంది. సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టి. జి. త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కెప్టెన్ మిల్లర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.…
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగువారి మనసుల్ని దోచుకున్నాడు దర్శకుడు శశి. అతని తాజా చిత్రం ‘సివప్పు మంజల్ పచ్చై’ను తెలుగులో ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో డబ్ చేసి, ఎ. ఎన్. బాలాజీ ఈ నెల 13న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శశి మాట్లాడుతూ, ”నేను గతంలో రూపొందించిన ‘శ్రీను, రోజాపూలు, బిచ్చగాడు’ చిత్రాలు తెలుగు వారిని ఆకట్టుకున్నాయి. సెంటిమెంట్ సినిమాలంటే టాలీవుడ్ ఆడియెన్స్ ప్రాణమిస్తారు. అదే నమ్మకంతో నేను తమిళంలో తీసిన ‘సివప్పు మంజల్ పచ్చై’…
మ్యూజిక్ డైరెక్టర్ నుండి యాక్టర్ గా మారిన ఎ. ఆర్. రెహ్మాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ ఇప్పుడు ఐదారు సినిమాలు చేస్తున్నాడు. అందులో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ కోవకు చెందిందే ‘బ్యాచిలర్’ మూవీ. గ్రామీణ, పట్టణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేమపిచ్చోడిగా నటిస్తున్నాడు జీవీ ప్రకాశ్ కుమార్. ఈ మూవీతో హీరోయిన్ గా దివ్యభారతి, డైరెక్టర్ గా సతీశ్ సెల్వకుమార్ పరిచయం…