Captain Miller : ధనుష్ త్రిభాషా చిత్రం ఎలా ఉండబోతోందంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, విలక్షణ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ కలయికలో ఓ భారీ పీరియాడికల్ చిత్రం రూపొందనుంది. 1930-40 నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ కానుంది. సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టి. జి. త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కెప్టెన్ మిల్లర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
శనివారం విడుదల చేసిన ‘కెప్టెన్ మిల్లర్’ అనౌన్స్ మెంట్ వీడియో చాలా ఆసక్తికరంగా వుంది. ఒక స్కెచ్ డ్రాయింగ్ లో 1930-40నాటి షిప్ ని చూపిస్తూ కథానాయకుడి పాత్ర ముఖం కనిపించకుండా స్కార్ఫ్ ని చుట్టుకొని ఒక వింటేజ్ బైక్ నడుపుకుంటూ రావడం, తర్వాత టైటిల్ రివిల్ కావడం ఎక్సయిటింగా వుంది. వీడియోలో వినిపించిన నేపధ్య సంగీతం అవుట్ స్టాండింగ్ గా వుంది. ‘కెప్టెన్ మిల్లర్’ అధికారిక ప్రకటనకు ముందే భారీ సంచలనం సృష్టించింది. సత్యజ్యోతి ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవంగా అందించే దిశగా ఎక్కడా రాజీలేకుండా పని చేస్తుంది. ప్రాజెక్ట్ ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి చిత్ర యూనిట్ ఏడాది పాటు విస్తృతమైన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేసింది. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘పుష్ప’ వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ సినిమా తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ అందిస్తున్నారు. జి. వి.ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చుతున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫర్ గా , నాగూరన్ ఎడిటర్ గా, టి.రామలింగం ఆర్ట్ డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు.
Also Read
నిర్మాత టి.జి. త్యాగరాజన్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ, ”మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కెప్టెన్ మిల్లర్’ ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఇది మా ప్రొడక్షన్ హౌస్ నుండి భారీ స్థాయిలో రూపొందిన ప్రామిసింగ్ మూవీలలో ఒకటిగా ఉంటుందని బలంగా నమ్ముతున్నాను. ఐకాన్ స్టార్ ధనుష్‌తో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఆనందంగా వుంటుంది. మేము గతంలో కలసి చేసిన చిత్రాలు విజయవంతమయ్యాయి. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ నాకు, ధనుష్‌కి స్క్రిప్ట్‌ను చెప్పినపుడు, మేమిద్దరం ఎగ్జైట్ అయ్యాం, భారీ స్థాయిలో రూపొదించాలని భావించాం. దర్శకుడు అరుణ్ అసాధారణమైన ఆలోచనలతో విలక్షణ ఫిల్మ్ మేకింగ్ మెథడాలజీలతో అసాధారణమైన చిత్రాలు అందిస్తుండటం ప్రశంసనీయం. దర్శకుడు స్క్రిప్ట్‌ను వివరించినప్పుడు, అతని ఆలోచన, అతని అద్భుతమైన స్క్రీన్‌రైటింగ్ నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం కోసం పని చేస్తున్న అత్యున్నత స్థాయి నటులు, సాంకేతిక నిపుణులతో ‘కెప్టెన్ మిల్లర్’ని మరింత గొప్ప స్థాయికి వెళుతుంది” అన్నారు. ‘కెప్టెన్ మిల్లర్’ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!