మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా వరుసగా మూడో రోజు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ప్రియాంకతో కలిసి విచారణ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణలో అధికారులు అడుగుతున్న ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేశారు.
గురుగ్రామ్ భూమి కేసుకు సంబంధించి వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా బుధవారం వరుసగా రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారైన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా యూపీ ఎంపీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏర్పాటు అయ్యిందని, ఇప్పుడు అదే సంస్థ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ ఈడీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లపై ఈడీ…
గురుగ్రామ్ భూమి కేసుకు సంబంధించి వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా బుధవారం వరుసగా రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోనికి వెళ్లారు. 2008 హర్యానా భూ ఒప్పందం, మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను ఈడీ విచారిస్తోంది. మంగళవారం దాదాపు ఐదు గంటల పాటు విచారించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PLMA) కింద ఆయన వాంగ్మూలాలను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం కూడా వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా రాబర్ట్…