Minister Piyush Goyal: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ నేడు (జూన్ 15) అమరావతికి రానున్నారు. రాష్ట్రానికి రానున్న ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలిసి లంచ్ మీట్లో పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధి, కేంద్ర సహకారంపై ప్రధానంగా చర్చించనట్టు తెలుస్తోంది. ఇక లంచ్ అనంతరం కేంద్ర మంత్రి గుంటూరులోని పొగాకు బోర్డ్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రంలో ఉన్న పొగాకు రైతుల సమస్యలు, దిగుబడి ధరలు, మార్కెట్ పరిస్థితులు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
Read Also: Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటల సమయం..!
అలాగే రాష్ట్రంలో పొగాకు సాగు కీలక వ్యవసాయ రంగంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ సమస్యలు, ఎగుమతి సమస్యలు వంటి అంశాలపై పీయూష్ గోయల్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ సందర్భంగా కేంద్రం నుండి తగినంత మద్దతు వచ్చేలా చర్యలు తీసుకుంటామంటూ సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలోని పొగాకు రైతులు కేంద్రం నుండి సహాయం, మద్దతుపై ఆశలు చిగురించనున్నాయి.
Read Also: LB Nagar: హైటెన్షన్ వైర్లు తెగిపడి ఇద్దరు సజీవదహనం..!