గుంటూరు జిల్లాలో సంచలనం కలిగించిన బ్యాంక్ కుంభకోణంలో దర్యాప్తు వేగంగా సాగుతోంది. తెనాలి జీడీసీసీ బ్యాంక్ కుంభకోణంలో బ్యాంక్ మేనేజర్ నేతి వరలక్ష్మిని ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు బ్యాంకు ఉన్నతాధికారులు. ఉద్దేశ్య పూర్వకంగానే నకిలీ బంగారంతో రుణాలు ఇచ్చినట్లు గుర్తించిన అధికారులు చర్యలను వేగవంతం చేశారు. రూ.44 లక్షల బ్యాంకు సొమ్మును నిందితులనుండి రికవరీ చేశారు అధికారులు. బ్యాంక్ మేనేజర్ ,అసిస్టెంట్ మేనేజర్ , క్యాషియర్ లపై సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. మరో వైపు క్రిమినల్…
ఉమ్మడి గుంటూరు జిల్లాలో బ్యాంక్ ఉద్యోగులు చేతి వాటం ఖాతాదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.. కంచె చేను మేసిన చందంగా బ్యాంక్ ఉద్యోగులు బ్యాంకుల్నే మోసం చేస్తున్నారు. నిన్న రాజుపాలెం మండలం నేడు తెనాలి జీడీసీసీ బ్యాంక్ లలో వరుస గోల్డ్ స్కాం లు బ్యాంక్ ల లో సిబ్బంది నిర్వాకాన్ని బయటపెట్టింది. పల్నాడు ప్రాంతం రాజుపాలెంలో సెంట్రల్ బ్యాంక్ లో గిల్ట్ బంగారం వ్యవహారం బయట పడింది. ఈ వ్యవహారం బయటకు వచ్చిన…
గత మూడు రోజులుగా హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థపై ద్రుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ హెన్రీ క్రిస్టినా. యాభై ఏళ్ళ క్రితమే హార్వెస్ట్ ఇండియా సంస్థను స్థాపించారు. పేదలకు, అస్వస్థతతో ఉన్న వారికి, అనాధ పిల్లలకు సేవ చేయడమే ఈ సంస్థ లక్ష్యం. పదిహేను అత్యున్నత సేవా అవార్డులను అందుకున్నాంమన్నారు. నా భర్త కత్తెర సురేష్ కుమార్ అరెస్టు అంటూ వార్తలు రాశారు. నా భర్త విదేశాల్లో ఉన్నారు. మాపై కొందరు కావాలనే…
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైసీపీ ఆధ్వర్యంలో శనివారం నాడు జాబ్ మేళా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ మేరకు తొలిరోజు జాబ్ మేళా విజయవంతంగా ముగిసినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. మొదటి రోజు 142 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని 7,473 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన వివరించారు. మరో 1,562 మంది షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలిపారు. 373 మందికి వెంటనే ఆఫర్ లెటర్ ఇచ్చినట్లు…
ఏపీలో నిరుద్యోగులకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గుడ్ న్యూస్ అందించారు. శని, ఆదివారాల్లో గుంటూరు-విజయవాడ జాతీయరహదారిపై నెలకొన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు రోజుల పాటు వైసీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు జాబ్ మేళా ఏర్పాట్లను శుక్రవారం మధ్యాహ్నం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు, ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి, కృష్ణా,…
దక్షిణ అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు ముందు వర్షాలతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మారింది. విశాఖలో చల్లని, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు శ్రీశైలంలో భారీ వర్షం పడింది. అకాల వర్షంతో ప్రధాన వీధులన్నీ జలమయం అయ్యాయి. శ్రీశైలంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో భక్తులు…
మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలతో గుంటూరు జిల్లా వణుకుతోంది. గుంటూరు జిల్లాలో వరుసగా కొనసాగుతున్న మహిళలపై లైంగిక దాడులు, హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏప్రిల్16న గురజాల రైల్వేస్టేషన్ లో ఒడిషాకు చెందిన మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. 27న కొల్లూరు మండలం చిలుమూరులో రూపశ్రీ అనే మహిళను పొలంలోనే హత్య చేశాడు ప్రవీణ్ అనే దుండగుడు. 28న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో వివాహిత తిరుపతమ్మ హత్యకు గురయింది. కోరిక తీర్చలేదని గొంతుకు చీర బిగించి హత్య చేశాడు. 29న…
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్రేప్ ఘటన మరువక ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో యువతిని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం తుమ్మపూడికి చెందిన వీరంకి తిరుపతమ్మ (35) పొలాలకు నీళ్లు పెట్టే పైపులు అద్దెకిస్తూ బతుకుతోంది. ఆమె భర్త శ్రీనివాసరావు పనుల కోసం తిరుపతి వెళ్లారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో మృతిచెంది పడి…
పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైంది కల్యాణ్ జ్యువెలరీ దుకాణంలో పనిచేసే రామాంజనేయులుగా గుర్తించారు. భర్త అపహరణపై నిన్న పోలీసులకు రామాంజనేయులు భార్య ఫిర్యాదు చేశారు. జంగం బాజితో పాటు అన్నవరపు కిషోర్ మరికొందరు షాపులోకి వచ్చి అపహరించారని ఫిర్యాదు చేశారు. రామాంజనేయులు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో చంటి అనే వ్యక్తి అదృశ్యం వెనుక రామాంజనేయులు ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే…
ఆ నియోజకవర్గంలో ఏ నాయకుడికి జెండా పట్టాలో.. ఎవరి సైకిల్ ఎక్కాలో కేడర్కు అర్థం కాని పరిస్థితి. పోటీకి సిద్ధమైన అభ్యర్థులు మాత్రం బస్తీమే సవాల్ అని గ్రూపులు కట్టి కొట్టుకుంటున్నారు. అధిష్ఠానం మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా.. అక్కడి లెక్కలు తేల్చకుండా కాలక్షేపం చేస్తున్నట్టు తమ్ముళ్ల అనుమానం. అసలు ఆ నియోజకవర్గంలో ఎందుకు అంత గందరగోళం? హైకమాండ్ లెక్కలేంటి? వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరో తేల్చలేని పరిస్థితి గుంటూరు జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన…