వివాహ సంబంధాలు ప్రాణాలు తీసుకునే పరిస్థిలకు దారి తీస్తున్నాయి. వారితో పాటు వారికి పుట్టిన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని వారితో పాటే ఆ చిన్నారుల ప్రాణాలను సైతం తీసేందుకు వెనుకాడటం లేదు తల్లిదండ్రులు. కుటుంబ కలహాలో.. లేక భార్య భర్తల మధ్య గొడవలు, అత్త, మామ, ఆడపడుచుల వేధింపులో.. లేక ఒకరిపై ఇంకొరి వాదనలతో వివాహేతర సంబందాలకు దూరమై ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. అయితే ఓతల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ.. పట్టాలు దాటుతుందో ఏమో తెలియదు…
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద పోలీసులు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి.. అక్కడి నుంచి తరలించారు. అయితే.. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో మట్టి దోపిడి జరుగుతుందని ఆరోపిస్తూ నేడు చలో అనుమర్లపూడికి ధూళిపాళ్ల నరేంద్ర పిలపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. గ్రామంలో 144 సెక్షన్ విధించినట్టుగా చెప్పారు. అనుమర్లపూడిలో నిరసనలకు అనుమతి…
అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా నిరుద్యోగ యువత హింసకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంపై అధికారులు తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తం అయ్యారు. రైల్వే ఉన్నత అధికారులతో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు. రైల్వే పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. పూర్తి పోలీస్ బందో బస్తుతో విశాఖ రైల్వే స్టేషన్ కొనసాగుతోంది. పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ యువత కి విజ్ఞప్తి చేస్తున్నాం. హింసాత్మిక కార్యక్రమాలు ద్వారా దేన్ని…
గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వాన్ని విమర్శించిన వెంకాయమ్మ కుటుంబంపై దాడి జరిగిందంటూ ఆరోపిస్తూ.. ఈ ఘటనకు నిరసనగా టీడీపీ ‘చలో కంతేరు’ పేరుతో ఆందోళనలు చేపట్టింది. అయితే టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని హౌస్ అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో కంతేరు ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. కంతేరులో సునీత, వంశీ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగిందని.. దీనిపై ఇద్దరూ ఫిర్యాదు చేయగా కేసులు నమోదు…
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. డాక్టర్ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్లు, హర్వెస్టర్లను జెండా ఊపి ప్రారంభించారు జగన్. రైతులకు పంపిణీ చేసే ట్రాక్టర్ ను స్వయంగా నడిపారు సీఎం జగన్. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయంలో ఖర్చు తగ్గించేందుకు వై.ఎస్.ఆర్. యంత్రసేవా పథకం ప్రారంభిస్తున్నాం అని చెప్పారు. వరి ఎక్కువగా పండించే ప్రాంతాలలో కంబైన్డ్ హార్వెస్టర్ లు అందుబాటులోకి తెస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి రైతు…
హత్యలు,ఆత్మహత్యలు, దాడులు.. సమాజంలో ఒకరిపై ఒకరు అక్కసు, అయిష్టం, కోపం ఎంతటి వారినైనా హత్య చేసేందుకు తెర లేపుతోంది. నవ సమాజంలో మానవత్వం నశిస్తోంది. మరీ క్రూరమృగాల్లా వ్యవహరిస్తున్నారు. మృగాలైనా జంతువులను చంపడానికి, వాటిపై దాడి చేయాడానికి కాస్తైన ఆలోచిస్తాయేమో గానీ.. కానీ, మనిషి మాత్రం ఏమాత్రం ఆలోచనలేకుండా మరీ మృగం కంటే హీనంగా బతుకుతున్నాడు. ఇలాంటి ఘటనలే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని.. విజయవాడ, గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్నాయి. విజయవాడ గురునానక్ కాలనీలో ఫుట్బాల్ ప్లేయర్ను దారుణంగా హత్య…
గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు, తాడికొండ ఒకప్పుడు టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలు. మధ్యలో నేతల మధ్య విభేదాలతో పార్టీ పట్టుకోల్పోయింది. అయినప్పటికీ అక్కడ టీడీపీకి గట్టి ఓటుబ్యాంకే ఉంది. గతంలో ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా మాకినేని పెదరత్తయ్య వరసగా ఐదుసార్లు గెలిచారు. ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారిన తర్వాత సైకిల్ జోరు తగ్గింది. కాంగ్రెస్, వైసీపీలు పట్టు సాధించాయి. ప్రస్తుతం మాజీ మంత్రి మేకతోటి సుచరిత వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదే పరిస్థితి తాడికొండలోనూ ఉంది.…
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మైనింగ్ గ్యాంగ్ రెచ్చిపోతోంది. పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ మట్టితవ్వేస్తూ దోచుకుంటున్నారు మైనింగ్ మాఫియా. అదేమని అడిగితే పట్టించుకునే నాథుడు లేడు. అడిగితే అధికారులను కూడా భయపెట్టే స్థాయికి బెదిరింపులతో మట్టి మాఫియా మాట్లాడుతుండటంతో వారికి అధికారపార్టీలో కొంతమంది మద్దతు ఉందని ప్రచారం జరగటంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రత్తిపాడు,పొన్నూరు, పెదకూరపాడు, వినుకొండ నియోకవర్గాల్లో రాత్రి అయితేచాలు ట్రాక్టర్లు లారీలు ప్రొక్లైనర్ల రీ సౌండ్…
మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే మాల్ ఇప్పిస్తామన్నారు. కొన్ని వస్తువులు అయితే మార్కెట్ రేటు కంటే నలభైశాతం తక్కువకే ఇస్తామని మాయమాటలు చెప్పారు. అందరినీ నమ్మించేందుకు రెండు మూడు నెలలు చెప్పినట్లే చేసి తర్వాత కోట్ల రూపాయలు వసూలు చేశారు. డబ్బులు ఇవ్వమంటే అడ్డం తిరగడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన పడుచూరి రమ్య, దిలీప్ లు గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో మోసాలకు తెరతీశారు. తెలిసిన…