ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఐదు డెడ్‌బాడీలు లభ్యమయ్యాయి. గుంటూరులో రెండు, కడప (వైఎస్సార్ జిల్లా)లో మూడు దొరికాయి. గుంటూరులో లభ్యమైన మృతదేహాలు యువతి, యుకుకుడివిగా గుర్తించారు. తెనాలిలోని రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో వీరి మృతదేహాలు కనిపించాయి. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని స్థానికులతో పాటు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైలు వేగంగా గుద్దడంతో గుర్తించలేనంతగా వీరి తలలు పగిలాయి. ఐడి కార్డు ఆధారంగా.. ఈ యువ జంట చేబ్రోలు…
వైసీపీ ప్లీనరీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తికావొచ్చాయి.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు సమావేశాలు సాగనున్నాయి..
సికింద్రాబాద్ రైల్వే ఘటనలో జరిగిన అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారి ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ అల్లర్ల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో వున్న ఆవుల సుబ్బారావు నోరువిప్పాడు. తన అనుచరులతో విధ్వంస రచన చేసినట్టు పోలీసులు తేల్చారు. శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే అనుచరులతో.. విద్యార్థులను రెచ్చగొట్టించినట్టు తేలింది. ఆందోళనలు చేయాలని వాట్సాప్ గ్రూపుల్లో అనుచరులు పిలుపునిచ్చారు. గుంటూరు ర్యాలీ…
మాజీ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడిగా.. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు సీఎం రేసులో నిలబడిన కన్నా లక్ష్మీనారాయణ మౌనం కేడర్‌కు అర్థం కావడం లేదట. గతంలో ఆయన పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు వరసగా గెలిచారు. రాజకీయ సమీకరణల్లో భాగంగా గుంటూరు పశ్చిమ ప్రాంతంతో అనుబంధం పెంచుకున్నారు. 2009లో అక్కడి నుంచి కూడా గెలిచారు కన్నా. మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2014 రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో కొంత ఇబ్బంది పడ్డారు.…