గుంటూరు తూర్పు నియోజక వర్గం, ఆర్టీసీ కాలనీలో టీడీపీలో బయటపడ్డ వర్గ విబేధాల ఘటనలో కేసు నమోదు అయింది. టీడీపీలోని ఒక వర్గం ఎమ్మెల్యేపై దాడి చేయడానికి ప్రయత్నం చేసిందని, తన మీద కూడా దాడికి వచ్చారని మహిళా కార్యకర్త మొవ్వ శైలజ పాత గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగర ఉపాధ్యక్షుడు ఫిరోజ్‌తో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీలోని రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడంతో…
గుంటూరు తూర్పు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. భగత్ సింగ్ జయంతి సందర్భంగా 1వ వార్డులో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు స్థానిక టీడీపీ మహిళా నేతలు.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరయ్యారు. అయితే.. వార్డులో కార్యక్రమాలు నిర్వహించే సమయంలో స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌ను అడ్డుకున్నారు టీడీపీ డివిజన్ స్థాయి నాయకులు.
నోటితో నవ్వుతూ.. నొసటితో వెక్కిరించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు గుంటూరు టీడీపీ నేతలు. పైగా ప్రచార యావ పెరిగిపోవడంతో.. వ్యక్తిగతంగా హైలైట్ కావడానికే చూస్తున్నారట. ఏ కార్యక్రమం చేసినా ఫొటోలు దిగడం.. గ్రూపులు కట్టుకోవడమే సరిపోతున్నట్టు తమ్ముళ్ల వాదన. ఈ పోకడలు కార్యకర్తల్లో కనిపిస్తే పెద్దగా పట్టించుకోరు కానీ.. నియోజకవర్గంలో పార్టీని నడిపించాల్సిన నాయకులే ఈ తరహాలో వింత పోకడలకు పోవడం ఆశ్చర్యం కలిగిస్తోందట. గుంటూరు నగరంలో గుంటూరు తూర్పు..గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నాయి. గుంటూరు నగర టీడీపీ…
ఆ నియోజకవర్గంలో ఏ నాయకుడికి జెండా పట్టాలో.. ఎవరి సైకిల్ ఎక్కాలో కేడర్‌కు అర్థం కాని పరిస్థితి. పోటీకి సిద్ధమైన అభ్యర్థులు మాత్రం బస్తీమే సవాల్ అని గ్రూపులు కట్టి కొట్టుకుంటున్నారు. అధిష్ఠానం మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా.. అక్కడి లెక్కలు తేల్చకుండా కాలక్షేపం చేస్తున్నట్టు తమ్ముళ్ల అనుమానం. అసలు ఆ నియోజకవర్గంలో ఎందుకు అంత గందరగోళం? హైకమాండ్ లెక్కలేంటి? వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరో తేల్చలేని పరిస్థితి గుంటూరు జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన…
గుంటూరులో టీడీపీకి నాయకుల కొరత ఏర్పడిందా? అధికారంలో ఉన్నప్పుడు తామే మొనగాళ్లం అని చక్రం తిప్పిన నేతలు.. అధికారం పోగానే ముఖం చాటేశారా? నామ్ కే వాస్తేగా ద్వితీయశ్రేణి నాయకులతో టీడీపీ కాలం నెట్టుకొస్తోందా? ఇంఛార్జ్ నియామకంలో పార్టీ వైఫల్యం చెందుతోందా? తమ్ముళ్లకు రిప్లయ్ ఇచ్చేవాళ్లే లేరా? ఎప్పటి నుంచో ఉన్న బలమైన కేడర్ దూరంగుంటూరు జిల్లాలో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉండే నియోజకవర్గాల్లో సిటీలోని పశ్చిమ సెగ్మెంట్ ఒకటి. దీంతోపాటు గుంటూరు నగరంలోనే ఉండే మరో నియోజకవర్గం…
మూడేళ్ల క్రితం వరకు ఆ జిల్లాలో టీడీపీ ఓ వెలుగు వెలిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ కకావికలం. నాడు కీ రోల్ పోషించిన నాయకులు పత్తా లేకుండా పోయారు. అధినేత ఆదేశాలతో ఫీల్డ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ నలుగురు పోరాటాలకు సిద్ధమయ్యారని టాక్. ఇంతకీ ఎవరా నాయకులు? స్వయంకృతాపరాధంతో హారతి కర్పూరమైన టీడీపీ ప్రతిష్ట! గుంటూరు జిల్లాను గతంలో తమ అడ్డాగా చెప్పుకొన్న టీడీపీ.. వైసీపీ గాలిలో ఆ అడ్రస్‌ను గల్లంతు చేసుకుంది.…