గుజరాత్‌లోని అన్ని రాజకీయ పార్టీలు వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, నవ్‌సారి అసెంబ్లీ నియోజకవర్గంలోని అంచేలి గ్రామస్తులతో పాటు 17 ఇతర గ్రామాల వాసులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 46 మంది అభ్యర్థులతో కూడిన 2వ జాబితాను కాంగ్రెస్ గురువారం విడుదల చేసింది. నవంబర్ 4న పార్టీ తన తొలి జాబితాను ప్రకటించింది.
Ahead Of Gujarat Elections, Another Congress MLA Joins BJP: గుజరాత్ లో బీజేపీ అధికారానికి గండికొడదాం అని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి భారీ షాకులు తగులుతున్నాయి. వరసగా రెండు రోజుల్లో వ్యవధిలో ఆ రాష్ట్రానికి చెందిన కీలక నేతలు బీజేపీ పార్టీలో చేరారు. సీనియర్ ఎమ్మెల్యే భగవాన్ బరాద్ బుధవారం శాసన సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈయన బీజేపీ పార్టీలో చేరనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వరుసగా ఐదోసారి గెలిచి అధికారాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది.
Gujarat police denied stone pelting on Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందేభారత్ ట్రైన్ పై దాడి జరిగిందని ఆరోపించారు ఆపార్టీ నేత వారిస్ పఠాన్. అయితే ఈ వాదనలను పోలీసులు ఖండించారు. అలాంటిదేం జరగలేదని గుజరాత్ పోలీసులు కొట్టిపారేశారు. తాను పార్టీ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న అహ్మదాబాద్ నుంచి వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో కొంతమంది రాళ్ల దాడికి పాల్పడినట్లు వారిస్ పఠాన్ ఆరోపించారు.…
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడిన వేళ గుజరాత్‌లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి షాక్ తగిలినట్టు అయ్యింది.. బీజేపీకి గుడ్‌బై చెప్పారు సీనియర్ నేత, మాజీ మంత్రి జేఎన్ వ్యాస్.. ఈ నేపథ్యంలో బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.. పార్టీలో ఫ్యాక్షనిజం పెరిగిపోయిందని, కొందరు నాయకులను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పఠాన్ ప్రాంతంలో ఈ ఫ్యాక్షన్ వ్యవహారం తీవ్రంగా ఉందని మండిపడ్డారు.. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా…
అక్టోబర్ 30వ తేదీన గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన దుర్ఘటనలో దాదాపు 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.
గుజరాత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ బీజేపీ కొత్త ఎన్నికల నినాదాన్ని గుజరాతీలో ప్రారంభించారు. 'నేను ఈ గుజరాత్‌ని తయారు చేశాను' అంటూ ఎన్నికల నినాదాన్ని ప్రారంభించారు.
గుజరాత్‌లో మోర్బీలలో వంతెన కూలిన దుర్ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మున్సిపల్ విభాగం చీఫ్ ఆఫీసర్(సీవో)ను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి ఫిబ్రవరి 18,2023తో ముగుస్తోంది. గత 25 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ తిరుగలేని అధికారాన్ని చెలాయిస్తోంది. ఈ సారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాను అధికారంలో ఉన్నానని చెబుతోంది.