గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం దక్కడానికి పార్టీ ఇప్పటివరకు చేసిన పనులే కారణమని బీజేపీ వీరంగామ్ అభ్యర్థి, పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో 2019లో ఆర్టికల్ 370 రద్దును కూడా ఆయన హైలైట్ చేశారు.
గుజరాత్‌లో మరోసారి తిరుగులేని విజయాన్ని అందుకుంది భారతీయ జనతా పార్టీ… ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీ స్థానాలను పెంచుకుంది.. 1995లో 121 స్థానాలు గెలిచిన బీజేపీ, 1998లో 117 స్థానాల్లో విజయం సాధించింది.. 2002లో 127 సీట్లు కైవసం చేసుకోగా.. 2007లో 117 స్థానలు.. 2012లో 115 స్థానాలు, 2017లో 99 స్థానాలకే పరిమితం అయ్యింది.. ఇప్పుడు 150 స్థానాలను దాటేసి 160 వైపు సాగుతుంది.. దీంతో, కమలం పార్టీ శిబిరంలో జోష్ పెరిగింది.. ఇక, మరోసారి…
Gujarat and Himachal Pradesh election results today: దేశవ్యాప్తంగా ఉత్కంఠతకు నేడు తెరపడనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలతో పాటు అన్ని పార్టీలకు, దేశప్రజలకు ఆసక్తి నెలకొంది. ఢిల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రాష్ట్రాలపై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే వరస పరాజయాలతో ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ఎదురుచూస్తోంది.…
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తుది దశ పోలింగ్ జరుగుతోన్న వేళ.. సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంతి ఖరాడీ.. బనస్కాంత జిల్లా దంతా ఎస్టీ రిజర్వుడు స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే… తనపై బీజేపీ అభ్యర్థి లాధు పర్ఘీ, అతడి అనుచరులు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు గుప్పించారు.. వారి నుంచి తన ప్రాణాలు కాపాడుకోడానికి 15 కిలోమీటర్లు పరిగెత్తాల్సి వచ్చిందని పేర్కొన్నారు.. అయితే, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిగ్నేష్…
ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనుంది. రెండో దశలో ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లో ఉన్న స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా.. ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5గంటలతో ముగిసింది. డిసెంబర్ 5న సోమవారం రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు తమ హేమాహేమీ నాయకులను ప్రచార బరిలోకి దింపాయి.
గుజరాత్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన తొలిదశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియగా.. గురువారం ఎన్నికలు జరగనున్నాయి. గురువారం ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5గంటలకు ముగియనుంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1,621 మంది అభ్యర్థుల్లో 330 మంది అంటే దాదాపు 20 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం వెల్లడించింది. అలాంటి 61 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రస్థానంలో ఉంది.