ఆరేబియా సముద్రంలో మరో ఆరు గంటల్లో తుఫాన్ ఏర్పడబోతుందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. కచ్ తీరం మరియు ఈశాన్య ఆరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని.. అది కాస్తా 6 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
ఆదివారం జరిగిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ఉమ్మడి ఆపరేషన్లో., గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్టు చేసి, వారి నుండి 602 కోట్ల రూపాయల విలువైన 86 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్థానీలు, స్ట్రింగ్ ఆపరేషన్ జరిగే సమయంలో అరెస్టును తప్పించుకునే ప్రయత్నంలో, ఎటిఎస్ అధికారులపై తమ పడవను నడపడానికి ప్రయత్నించారు. దీనికి ప్రతీకారంగా కాల్పులు జరిపారు. అనంతరం అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.…
అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భారతీయ నౌకాదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) మంగళవారం నాడు ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో సుమారు 3,300 కేజీల మాదకద్రవ్యాల్ని సీజ్ చేశారు.
భారత తీర రక్షక దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్‌లో మాదకద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ బోట్ పట్టుబడింది. పడవ నుంచి 200 కోట్ల రూపాయల విలువచేసే 40 కిలోల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Indian Coast Guard sent back the Pakistani warship: ఇండియన్ కోస్ట్ గార్డ్స్ పాకిస్తాన్ కు చెందిన యుద్ధ నౌకను తరిమిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ పోర్ బందర్ తీరంలోని అరేబియా సముద్ర జలాల్లో జూలై నెలలో ఈ ఘటన జరిగింది. పాక్ యుద్ధ నౌక ఆలంగీర్ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా ఉన్న సముద్ర జలాలను దాటి భారత్ జలాల్లోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ గుర్తించింది.