గుజరాత్‌లో సరికొత్త రికార్డు సృష్టిస్తూ కమలం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. వరుసగా ఏడోసారి విజయం సాధించి 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 182 స్థానాల్లో 156 స్థానాలను కైవసం చేసుకుంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు విజయాన్ని సాధించింది. మొత్తం 182 స్థానాలకు గానూ 156 స్థానాల్లో గెలుపొంది రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ ఎన్నికల్లో జూమ్ నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. రివాబా జడేజా ఘనవిజయం సాధించింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ గుజరాత్ ఇన్‌ఛార్జి రఘు శర్మ తన రాజీనామాను కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గేకి గురువారం సమర్పించారు.
గుజరాత్ అసెంబ్లీలో కేవలం 16 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగిన కాంగ్రెస్ పార్టీకి మరోదెబ్బ తగిలింది. గుజరాత్‌లో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కించుకోలేని స్థితిలో పడిపోయింది.