గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శుక్రవారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు వచ్చి రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు రాజీనామా సమర్పించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
గుజరాత్ ప్రజలు బీజేపీవైపేనని మరోసారి నిరూపించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన అనంతరం ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
గుజరాత్ అసెంబ్లీలో కేవలం 16 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగిన కాంగ్రెస్ పార్టీకి మరోదెబ్బ తగిలింది. గుజరాత్‌లో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కించుకోలేని స్థితిలో పడిపోయింది.
ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనుంది. రెండో దశలో ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లో ఉన్న స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా.. ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5గంటలతో ముగిసింది. డిసెంబర్ 5న సోమవారం రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు తమ హేమాహేమీ నాయకులను ప్రచార బరిలోకి దింపాయి.
గుజరాత్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన తొలిదశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియగా.. గురువారం ఎన్నికలు జరగనున్నాయి. గురువారం ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5గంటలకు ముగియనుంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1,621 మంది అభ్యర్థుల్లో 330 మంది అంటే దాదాపు 20 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం వెల్లడించింది. అలాంటి 61 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రస్థానంలో ఉంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్‌కు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున పలు పార్టీలకు చెందిన నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. పలువురు అగ్రనేతల ప్రచారంతో గుజరాత్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కిది. నేడు ప్రధాని నరేంద్ర మోడీ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ డైమండ్ సిటీ సూరత్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.