ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలలో అతి పెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్‌ను గుడివాడలో ఘనంగా ప్రారంభించారు. నెహ్రూ డౌక్ సెంటర్‌లో బుధవారం (నవంబరు 27)న ఉదయం 09:30 గంటలకు గుడివాడ శాసనసభ్యులు వెదిగండ్ల రాము ప్రారంభించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద దేశం అవుతాం.. 2019 నుంచి కూడా మేమే ఉండి ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చేసేవాళ్లం.. రచ్చబండే నా స్టేజీ... సింపుల్ గవర్నమెంట్ ఉండాలి. నా జీవితాంతం ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరిక నిర్మూలన చేస్తా-సీఎం చంద్రబాబు
అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో మొదటిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు.. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభంకానుండగా.. రేపు వివిధ జిల్లాల్లో మిగత 99 క్యాంటీన్లను.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు.
కొడాలి నానిని తిట్టాలని నాకు ఏమీ లేదు అన్నారు పవన్ కల్యాణ్.. నాకు వ్యక్తిగతంగా కొడాలి నానితో ఏ శత్రుత్వం లేదన్నారు.. అయితే, వంగవీటి రాధా వివాహంలో కొడాలి నాని కనపడితే కలిశాను అని గుర్తుచేసుకున్నారు.. కానీ, కొడాలి నాని నోరు పారేసుకునే ఎమ్మెల్యే అని విమర్శించారు.. నాని నోరు కట్టడి చేయాలి అంటే రాముని గెలిపించాలని గుడివాడ ప్రజలకు పిలుపునిచ్చారు.
రాయి దాడి ఘటనపై తొలిసారి స్పందించిన సీఎం వైఎస్ జగన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కృష్ణా జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుండగా.. గుడివాడ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల్లో పెత్తందారుల ఓటమి తప్పదు అని హెచ్చరించారు.. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదన్న ఆయన.. ఈ స్థాయికి వాళ్లు దిగజారారు అంటే మనం విజయానికి దగ్గరగా, వాళ్లు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నాడన్న ఆయన.. దానికి నిదర్శనం గుడివాడ సీటే అని వ్యాఖ్యానించారు.
గుడివాడలో రా..! కదలి రా..! కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ కొడాలి నానిది నోరా..? డ్రైనేజా..?.. నా దగ్గరే ఓనమాలు నేర్చుకుని.. నన్నే విమర్శిస్తారా..? నేనేంటో చూపిస్తానంటూ ఆయన పేర్కొన్నారు.
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. గుడివాడలో పొలిటికల్ రగడ మొదలైంది.. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి..