Sharad Pawar: ఎన్సీపీ నేత శరద్ పవార్, బిలియనీర్ గౌతమ్ అదానీని కలిశారు. ఆయన ఇంటితో పాటు కార్యాలయాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం అహ్మదాబాద్ లో అదానీని కలిశారు. ఇద్దరూ కలిసి అహ్మదాబాద్ లో భారతదేశపు తొలి లాక్టోఫెర్రిన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ‘‘ భారతదేశం యొక్క మొట్టమొదటి లాక్టోఫెర్రిన్ ప్లాంట్ ఎక్స్‌మ్‌పవర్‌ను గుజరాత్‌లోని చాచర్‌వాడిలోని వస్నాలో మిస్టర్ గౌతమ్ అదానీతో కలిసి ప్రారంభించడం ఒక విశేషం’’ అని పవార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Dharavi Project: ధారవి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు ఎలాంటి అనవసర ప్రయోజనం చేకూర్చలేదని హైకోర్టులో పేర్కొంది.