క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదరుచూస్తున్న ఆసియా కప్ నేడు ( బుధవారం ) స్టార్ట్ అయింది. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో నేపాల్ జట్టు తలపడుతుంది. అయితే, టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ కు నేపాల్ బౌలర్లు వరుస షాక్స్ ఇచ్చారు.